Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!

హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్.. పురుషుల టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాజంపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పేరును మంగళవారం ప్రకటించింది.

అగార్కర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన సీఏసీ.. అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బాధ్యతలు అప్పగించింది. అయితే చీఫ్ సెలెక్టర్‌గా నియమితులైన అగార్కర్‌కు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అగార్కర్ ముందు వరకు ఈ వేతనం రూ.1 కోటీగా ఉండగా.. దీన్ని బీసీసీఐ మూడింతలు చేసింది.

Fans in awe as Team Indias chief selector Ajit Agarkars annual salary will be 3 crores

అగార్కర్ వేతనం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా.. క్రిక్‌బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒక కోటీ జీతం ఉండటంతో దిగ్గజ ఆటగాళ్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఆరంభంలో అజిత్ అగార్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందని ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించాడని పేర్కొంది.

ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలెక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచినట్లు తెలిపింది. ఈ వార్షిక వేతనంతో పాటు డెయిలీ, ట్రావెల్ అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. ఇక చీఫ్ సెలెక్టర్ జీతం రూ.3 కోట్లు ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దేశ ప్రధాని నరేంద్రమోదీ జీతం కంటే ఇది ఎక్కువని, ఆయన వార్షిక వేతనం రూ. 2 కోట్లు మాత్రమేనని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వార్షిక కాంట్రాక్టుల్లో గ్రేడ్ బీ ఆటగాళ్లు అందుకునే వేతనం‌తో సమానమని గుర్తు చేస్తున్నారు. గ్రేడ్ బీ ఆటగాళ్లకు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందుతోంది.

మూడు ఫార్మాట్లు ఆడిన ఆటగాడితో పాటు కాస్త వయసు తక్కువ ఉన్న మాజీ ప్లేయర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉండాలని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లు ఆడిన అనుభవంతో పాటు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చింది.
అతని కోసం జీతం కూడా పెంచింది.

అగార్కర్ సెలెక్షన్ కమిటీలో శివసుందర్‌ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌ సభ్యులుగా ఉన్నారు. భారత తరఫున 26 టెస్ట్‌లు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడిన అగార్కర్.. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు కూడా అగార్కర్‌పైనే ఉంది. 21 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ బాదాడు.

Story first published: Wednesday, July 5, 2023, 12:20 [IST]
Other articles published on Jul 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+