Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఫైనల్లో ఆర్‌సీబీ X ముంబై ఇండియన్స్.. అప్పుడు ఉంటుందిరా చారీ!

ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ముగిసింది. నాలుగో జట్టుగా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇతర మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.

ఇప్పుడు ఈ నాలుగు జట్లు టాప్-2 ప్లేస్‌లో నిలవడంపై ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-1 ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు టీమ్స్ టాప్-2 ప్లేస్‌పై కన్నేసాయి.

Fans hope for RCB vs MI clash in the IPL 2025 final

టాప్-2 నిలవాలంటే..?
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా గుజరాత్ టైటాన్స్ టాప్-2 ప్లేస్ ఖరారు అవుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్‌ రద్దుతో 17 పాయింట్స్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో తదుపరి రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిస్తే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్ ఖరారు అవుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ కూడా 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్‌ రద్దుతో 17 పాయింట్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే టాప్-2లో నిలుస్తోంది. ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర జట్లు 18 పాయింట్స్‌కే పరిమితమైతే మాత్రం ముంబైకి టాప్-2లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే తదుపరి లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగనున్నాయి.

ఫైనల్లో ఆర్‌సీబీ X ముంబై..
ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అర్హత సాధించడంతో.. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత జనాదరణ కలిగిన ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగితే.. ఐపీఎల్ 2025 సీజన్‌ చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ మ్యాచ్‌గా చరిత్రకెక్కుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ రెండు జట్లు ఫైనల్ చేరి ఆర్‌సీబీ విజయం సాధించాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటే.. ఫైనల్ చేరితో ఓడిన చరిత్ర ముంబైకి లేదని ఆ టీమ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరితే సినిమాకు మించిన డ్రామా ఉంటుందని, ఊహించుకుంటేనే ఎలానో ఉందని కామెంట్ చేస్తున్నారు. 'ఫైనల్లో ఆర్‌సీబీ X ముంబై ఇండియన్స్.. అప్పుడు ఉంటుందిరా చారీ'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Thursday, May 22, 2025, 13:55 [IST]
Other articles published on May 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+