Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బెన్ స్టోక్స్.. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు!

భారత్‌తో ఐదో టెస్ట్ సందర్భంగా ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ వోక్స్.. ఈ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'క్రిస్ వోక్స్.. ఐదో టెస్ట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ చివర్లో అతని గాయాన్ని మరోసారి అంచనా వేస్తాం'అని ట్వీట్ చేసింది.

చినుకులతో చికాకు గురి చేసిన తొలి రోజు ఆటలో కరుణ్ నాయర్ కొట్టి బౌండరీని ఆపే ప్రయత్నంలో క్రిస్ వోక్స్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన క్రిస్ వోక్స్.. భుజ గాయానికి గురయ్యాడు. ఫిజియోల సాయంతో మైదానం వీడాడు. ఆఖరి సెషన్ ఆటలో జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Fans Hit Back at Ben Stokes Absolutely Ridiculous Injury Replacement Comments After Chris Woakes Ruled Out of 5th Test

బౌండరీ ఆపబోయి..

ఈ ఓవర్ ఐదో బంతిని కరుణ్ నాయర్.. మిడాఫ్ దిశగా ఆడగా.. అటు వైపే ఫీల్డింగ్ చేసిన క్రీస్ వోక్స్ పరుగెత్తి బంతిని బౌండరీ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను కిందపడిపోయాడు. అతని ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దాంతో క్రిస్ వోక్స్‌కు తీవ్రగాయమైంది. నొప్పితో అతను మైదానం వీడాడు. గాయం తీవ్రత చూస్తుంటే.. అతని ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్లు కనిపించింది. అతన్ని ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. మరోవైపు క్రిస్ వోక్స్‌కు గాయం కావడంతో మరో పరుగు తీయకుండా కరుణ్ నాయర్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. క్రిస్ వోక్స్‌ గైర్హాజరీలతో ఇంగ్లండ్ 10 మంది ఆటగాళ్లతోనే ఈ మ్యాచ్ ఆడనుంది. ఇది ఆ జట్టుకు తీవ్ర నష్టం చేయనుంది.

కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు

నాలుగో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసిన రిషభ్ పంత్‌ కుడి కాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. నొప్పిని భరిస్తూనే జట్టు కోసం అతను బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఆటగాళ్లు ఇలా తీవ్రంగా గాయపడినప్పుడు ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్‌కు అనుమతిచ్చేలా ఐసీసీ రూల్స్ మార్చాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. అయితే డిమాండ్‌ను బెన్ స్టోక్స్ తప్పుబట్టాడు. నాలుగో టెస్ట్ డ్రా అయిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న బెన్ స్టోక్స్.. ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్ డిమాండ్ హాస్యాస్పదమన్నాడు.

హాస్యాస్పదం..

ఇంజ్యూరీ రీప్లే‌స్‌మెంట్ గురించి చర్చ జరగడం హాస్యాస్పదం. ఈ రూల్‌లో చాలా లూప్ హోల్స్ ఉండే అవకాశం ఉంది. జట్లు ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూంగా ఈ రూల్‌ను వాడుకోవచ్చు. గాయాలు ఆటలో భాగం. కంకషన్ రీప్లేస్‌మెంట్‌ రూల్ ఒకే. అది ఆటగాడి సంక్షేమం, భద్రతకు సంబంధించినది. కానీ ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్ అలా కాదు. ఈ చర్చ ఆగిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే జట్లు ఫేక్ ఎమ్‌ఆర్‌ఐ స్కాన్స్ పెట్టి ఆటగాడిని రిప్లేస్ చేసుకోవచ్చు.'అని ఈ వాదనను స్టోక్స్ తప్పుబట్టాడు. ఆఖరి టెస్ట్‌లో క్రిస్ వోక్స్ తీవ్ర గాయంతో దూరమవడంతో ఇంగ్లండ్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు బెన్ స్టోక్స్ ఈ వాదనకే కట్టుబడుతాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదని కామెంట్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ గేమ్‌లోలాగా ఇంజ్యూరీ రీప్లెస్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Story first published: Friday, August 1, 2025, 16:31 [IST]
Other articles published on Aug 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+