Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2025: పొట్టోడే కానీ గట్టోడు !

'పొట్టోడే కానీ గట్టోడు' ఈ సామెత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు సరిగ్గా సరిపోతుంది. చూడటానికి బవుమా పొట్టిగా అనిపించినా.. ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో బవుమా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించాడు. ఆస్ట్రేలియా విజయానికి.. ఓటమికి బవుమా అడ్డుగోడలా నిలబడ్డాడు.

ఎయిడెన్‌ మార్క్‌రమ్(159 బంతుల్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగితే.. టెంబా బవుమా(121 బంతుల్లో 5 ఫోర్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో 282 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. సౌతాఫ్రికా విజయానికి 69 పరుగుల అవసరం కాగా.. ఆస్ట్రేలియాకు 8 వికెట్లు కావాలి.

Fans Hails Temba Bavuma for his fighting knock in SA vs AUS WTC Final 2025

బవుమా పోరాటంతోనే..

నాలుగో రోజు ఆటలో అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవలేదు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే ఆలౌటైన సౌతాఫ్రికా 282 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ పిచ్ అనూహ్యంగా బ్యాటింగ్‌కు అనుకూలించడం.. మార్క్‌రమ్ సెంచరీ.. బువుమా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌పై సఫారీ టీమ్ పట్టు బిగించింది. అయితే మార్క్‌రమ్‌కు బవుమా అండగా నిలవడంతోనే ఇది సాధ్యమైంది. ఓవైపు మార్క్‌రమ్ స్వేచ్చగా ఆడగా.. మరోవైపు బవుమా తనదైన బ్యాటింగ్‌తో ఆసీస్ పేసర్ల సహనాన్ని పరీక్షించాడు.

గాయంతో పోరాడుతూనే..

తొలి ఇన్నింగ్స్‌లో బవుమా తన మొదటి రన్ కోసం 30 బంతులాడాడు. ఇది ఆస్ట్రేలియా అభిమానులు నవ్వుకున్నారు.. సోషల్ మీడియా వేదికగా వెక్కిరించారు. కానీ.. అదే బవుమా.. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా గెలుపు భాద్యతను తన భుజాలపై వేసుకున్నాడు. మార్క్‌రమ్ సెంచరీ చేసినా.. అసలు సిసలు టెస్ట్‌ బ్యాటింగ్‌తో అతనికి అండగా నిలిచింది మాత్రం బవుమానే. ఓవైపు తొడ కండరాల గాయం ఇబ్బంది పెడుతున్నా మరోవైపు కసితో బవుమా బ్యాటింగ్ చేశాడు.

గెలిస్తే చరిత్రే..

క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ గెలిచింది. అది కూడా 1998లో నాకౌట్ ట్రోఫీ( ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫి)ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ చేరినా.. దురదృష్టం ఎదురైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ చేతిలో ఖంగుతిన్న సౌతాఫ్రికా.. ఈసారైన టైటిల్ గెలవాలనే కసితో ఉంది. మెజార్టీ క్రికెట్ అభిమానులు కూడా సౌతాఫ్రికానే గెలవాలని కోరుకుంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచి గదను అందుకుంటే మాత్రం మార్కరమ్ , బవుమా పేర్లు సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి.

Story first published: Saturday, June 14, 2025, 12:25 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+