Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Temba Bavuma: ఈ పేరు చానా ఏండ్లు యాదుంటది!

టెంబా బవుమా.. ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం మారు మోగుతున్న పేరు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సౌతాఫ్రికాకు టైటిల్ అందించిన యోధుడు.! వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సఫారీ టీమ్‌ను విజేతగా నిలబెట్టిన నాయకుడు.! అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు.! చోకర్స్ అనే మరకను తుడిచేసిన ధీరుడు.! పొడుగోళ్లను చిత్త జేశిన పొట్టోడు.. తెల్లగున్నోళ్లను ఓడించిన నల్లొడు..! గుర్తు పెట్టుకోండి..'టెంబా బవుమా'ఈ పేరు చానా ఏండ్లు యాదుంటది!

బవుమా.. ది గ్రేట్..

'పొట్టోడే కానీ గట్టోడు' ఈ సామెత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు సరిగ్గా సరిపోతుంది. 5. 4 అడుగుల ఎత్తే ఉండే బవుమా.. సౌతాఫ్రికా జట్టుకు పూర్తి స్థాయి మొట్ట మొదటి నల్ల జాతి కెప్టెన్.
ఇప్పటి వరకు తన సారథ్యంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా సౌతాఫ్రికా ఓడిపోలేదు. పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం.. బవుమా ప్రత్యేకత. సౌతాఫ్రికా తరఫున ఏ శ్వేత జాతి కెప్టెన్ కూడా సాధించలేనిది బవుమా సాధించాడు.

Fans Hails Temba Bavuma After Historic WTC Final Win

డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు జరిగిన ఫొటో సెషన్‌ను చూసి బవుమాను అందరూ పొట్టోడా అని ట్రోల్ చేశారు. ముఖ్యంగా కమిన్స్‌తో కలిసి టాస్‌కు వచ్చిన ఫొటోను పెట్టి బవుమాను బఫూన్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ పొట్డోడే.. పొడుగోళ్ల జట్టును చిత్తు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో మార్క్‌రమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 147 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ పార్ట్‌నర్‌షిప్ ఆసీస్ పతనాన్ని శాసించింది. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. మార్క్‌రమ్-బవుమా తమ విజయవకాశాలను లాగేసుకున్నారని తెలిపాడు.

చెప్పినట్లే గెలిచాడు..

సౌతాఫ్రికా విజయానికి చేరువైన సమయంలో సౌతాఫ్రికా దిగ్గజాలు గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్‌ ఎగ్జయిటింగ్‌గా కనిపించారు. విజయానంతరం ఎగిరి గంతేసారు. తమ జీవితంలో సాధించలేనిది బవుమా సాధించి పెట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభానికి ముందు బవుమా ఒక మాటన్నాడు. ఈ టైటిల్ గెలిస్తే సౌతాఫ్రికాలో టెస్ట్ క్రికెట్‌కు మంచి రోజులు వస్తాయని, ఇది సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నాడు. అందుకే ఈ మ్యాచ్ గెలవాలని చెప్పాడు. అన్నట్టుగానే గెలిచాడు.

Story first published: Saturday, June 14, 2025, 21:29 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+