Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Suryavanshi: బుడ్డోడా.. ఏం గుండెరా నీది?

ఐపీఎల్ 2026 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు, టీనేజ్ సెన్సేషన్‌ వైభవ్ సూర్యవంశీ ఘనంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లోనే తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే బెరుకు కూడా లేకుండా తొలి బంతి నుంచే హిట్టింగ్ మొదలు పెట్టాడు.

అదృష్టవశాత్తు తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ.. రెండో బంతినే సిక్సర్ తరలించాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కార్తీక్ శర్మ వదిలేయడంతో పాటు బౌండరీ ఆపలేకపోయాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బుడ్డోడు మరుసటి బంతినే డీప్ మిడ్‌ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Fans hails 15-Year-Old Vaibhav Suryavanshi after He Smashes Second-Fastest IPL Fifty in RR vs CSK Clash

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 13 బంతుల్లో హాఫ్ సెంచరీతో యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో వైభవ్ ఉన్నాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

సీఎస్‌కే బ్యాటర్లు తడబడిన వికెట్‌పై వైభవ్ సూర్యవంశీ అలవోకగా సిక్సర్లు బాదాడు. మొత్తం 5 సిక్సర్లతో మ్యాచ్‌ను చెన్నై నుంచి లాగేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు బుడ్డోడా.. ఏం గుండెరా నీది అని కొనియాడుతున్నారు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీలు (బంతుల వారీగా):

13 బంతులు - యశస్వి జైస్వాల్ vs కేకేఆర్ (KKR), కోల్‌కతా, 2023

15 బంతులు - వైభవ్ సూర్యవంశీ vs సిఎస్కె (CSK), గౌహతి, 2026* * 17 బంతులు - వైభవ్ సూర్యవంశీ vs జిటి (GT), జైపూర్, 2025

18 బంతులు - జోస్ బట్లర్ vs ఢిల్లీ డేర్‌డేవిల్స్, ఢిల్లీ, 2018

Story first published: Monday, March 30, 2026, 22:25 [IST]
Other articles published on Mar 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+