IND vs ENG: అదరగొట్టిన అయ్యగారూ.. వాట్ ఏ చేంజ్ దొర!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లోభారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఐదు టీ20ల సిరీస్‌లో పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. వన్డేల్లో మాత్రం మూడు విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ముందు వరకు దద్దమ్మ అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆటతోనే విమర్శకులకు బదులిచ్చాడు.

మ్యాచ్‌కు ముందు ఘాటు విమర్శలు.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లో తీవ్రంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్‌ను పక్కనపెట్టాలని విశ్లేషకులు సూచించారు. వాషింగ్టన్ సుందర్ కాళ్లు, చేతులు లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. సుందర్ టెస్ట్‌లకు మాత్రమే పనికివస్తాడని తీర్పు ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అసలు జట్టులో ఎందుకు కొనసాగుతున్నాడో తనకు అర్థం కావడం లేదని టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి అన్నాడు.
సుదీర్ఘ కాలంగా అతను రాణించిందేం లేదని విమర్శించాడు. కేవలం గంభీర్‌కు ఇష్టమైన ఆటగాడు కావడంతోనే సుందర్ జట్టులో కొనసాగుతున్నాడని విహారి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో సుందర్‌ను ఆడించవద్దని కూడా ఈ మాజీ ఆటగాళ్లు మేనేజ్‌మెంట్‌కు సూచించారు.
వాట్ ఏ చేంజ్ దొర..!
గంభీర్ మాత్రం ఈ మాటలను పట్టించుకోకుండా సుందర్‌ను ఆడించి ఫలితం రాబట్టాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్.. వికెట్ తీయకపోయినా 13 పరుగులే ఇచ్చాడు. బ్యాటింగ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి అక్షర్ పటేల్‌తో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించాడు. దాంతో సుందర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తిట్టిన నోళ్లే అతన్ని ప్రశంసిస్తున్నాయి. నెటిజన్లు అయితే 'అదరగొట్టిన అయ్యగారూ.. వాట్ ఏ చేంజ్ దొర'అని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

