Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీని వదిలితే షాబాజ్ ఏందీ? ఎవ్వడైనా సక్సెస్ అవుతాడు! పేలుతున్న మీమ్స్!

దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 118 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఫైటింగ్ నాక్‌తో జట్టును ఆదుకున్నాడు. షాబాజ్ సూపర్ సెంచరీతో బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసింది. అయితే షాబాజ్ అహ్మద్ ఫైటింగ్ సెంచరీపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి.

Fans hail Shahbaz Ahmed for VHT 100, trolls RCB for trading him

తన పాత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీని ఉద్దేశించి ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ వరకు ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన షాబాజ్ అహ్మద్.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దాంతో అతన్ని ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఆర్‌సీబీ వదిలేసింది.

ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ డీల్ కింద షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇచ్చేసిన ఆర్‌సీబీ.. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన మయాంక్ దాగర్‌ను తీసుకుంది. ఈ మార్పు మహిమనో లేక జట్టు నుంచి తీసేసారనే కసో తెలియదు కానీ షాబాజ్ అహ్మద్ ఫైటింగ్ సెంచరీతో వార్తల్లో నిలిచాడు.

దాంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఆర్‌సీబీని వదిలేస్తే షాబాజ్ ఏందీ? ఎవ్వడైనా సక్సెస్ అవుతాడని సెటైర్లు పేల్చుతున్నారు. గతంలో ఆర్‌సీబీని వదిలిన ఆటగాళ్లంతా సక్సెస్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినీస్‌, కేఎల్ రాహుల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు.. ఆర్‌సీబీని వదిలి అద్బుతంగా రాణించారు.

చివరకు అభిమానులు కూడా ఆర్‌సీబీలోకి వెళ్లి బయటకు వస్తే సెంచరీలు బాదుతారని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

షాబాజ్ అహ్మద్ సెంచరీ బాదినా.. బెంగాల్ విజయాన్ని అందుకోలేకపోయింది. లక్ష్యచేధనకు దిగిన హర్యానా 45.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 226 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

Story first published: Monday, December 11, 2023, 16:55 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+