Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Shami: జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు మామ!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు ఆనందంగా జీవిస్తే మరికొన్ని రోజులు.. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నాయా? అనిపిస్తోంది. అపర కుబేరుడి నుంచి సాధారణ కూలీ వరకు ప్రతీ ఒక్కరి జీవితం ఇలానే ఉంటుంది. ఊహించని పరిణామాలు..అనూహ్య పరిస్థితులు ప్రతీ ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

కష్టాలకు కుంగిపోకుండా.. సంతోషాలకు ఉప్పొంగిపోకుండా.. పరిస్థితులకు తగ్గట్లు నడుచుకుంటూ ముందుకు సాగడమే జీవితం. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జీవితం కూడా అంతే.! భారత క్రికెట్‌లోకి తార జువ్వలా దూసుకొచ్చిన షమీ.. వ్యక్తిగత జీవితంలో ఏ మనిషి ఎదుర్కోకూడని కష్టాలను అనుభవించాడు.

Fans Hail Mohammed Shami After He Receives Prestigious Arjuna Award From President Droupadi Murmu

ఏ తండ్రి సహించని మానసిక వ్యధను భరించాడు. ఏ భర్త తట్టుకోలేని టార్చర్‌ను ఎదుర్కొన్నాడు. కట్టుకున్న భార్యే ఫిక్సర్, ఛీటర్, రేపిస్ట్ అంటూ నిందలు మోపడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన అతను ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కానీ ఈ కష్టాలు ఏవీ షమీ సక్సెస్‌ను ఆపలేకపోయాయి.

తండ్రిగా.. భర్తగా.. వ్యక్తిగత జీవితంలో మహమ్మద్ షమీ విఫలమైనా.. అంతర్జాతీయ క్రికెటర్‌గా మాత్రం సూపర్ సక్సెస్ సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వార భారత రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు.

మంగళవారం జరిగిన జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మహమ్మద్ షమీ ఈ అవార్డు స్వీకరించాడు. అత్యున్నత క్రీడా పురస్కారాన్ని షమీ అందుకున్న సందర్భంగా అభిమానులు.. అతని కష్టాలను గుర్తు చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Fans Hail Mohammed Shami After He Receives Prestigious Arjuna Award From President Droupadi Murmu

కట్టుకున్న భార్య.. కన బిడ్డ దూరమైనా.. సతీమణి చేసిన ఆరోపణలకు షమీ తన ఆటతోనే బదులిచ్చాడు. విధిరాత పెట్టిన పరీక్షల్లో నెగ్గి ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకంగా నిలిచాడు.

పెళ్లాం దూరమైందని, టార్చర్ పెడుతుందని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో ఓ అంతర్జాతీయ క్రికెటర్‌గా తన సమస్యలను అధిగమించి ప్రపంచకప్ 2023లో తన అవకాశం కోసం ఎదురు చూసి సత్తా చాటడం కాకుండా.. హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి అర్జున అవార్డును అందుకోవడం అద్భుతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. పెళ్లాం టార్చర్‌ను తట్టుకొని నిలబడిన షమీ.. చాలా గొప్పోడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మహమ్మద్ షమీ కష్టానికి దక్కిన ప్రతిఫలం అర్జున అవార్డ్ అని అభిప్రాయపడుతున్నారు. కన్న కూతురు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నా... భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడిన మహమ్మద్ షమీ డెడికేషన్‌కు వచ్చిన గుర్తింపు అని కొనియాడుతున్నారు.

Story first published: Tuesday, January 9, 2024, 18:06 [IST]
Other articles published on Jan 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+