క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌కు సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ నిశ్చితార్థానికి సంబంధించి సచిన్ కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అత్యంత గోప్యంగా సన్నిహితుల సమక్షంతో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అయితే సానియా చందోక్.. అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే సానియా అర్జున్‌కు పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాహం జరిపించేందుకు సిద్దమయ్యారు. అయితే అర్జున్-సానియా ప్రేమ వ్యవహారం గురించి తెలియగానే సచిన్ టెండూల్కర్ షాక్‌కు గురయ్యారంట. ఏమాత్రం సందేహం రాకుండా అర్జున్ టెండూల్కర్ ప్రేమాయణం నడిపించాడంట. తన సోదరి సారా టెండూల్కర్‌కు కూడా తెలియకుండా మనోడు సానియాను బుట్టలో వేసుకున్నాడట. చాలా రోజులుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నా.. సచిన్ ఫ్యామిలీ కనిపెట్టలేకపోయిందంట.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన సానియా... ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన 'మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ'కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దుతోంది. ముంబైకి చెందిన సెలెబ్రిటీలు సానియాకు కస్టమర్లు. సారా టెండూల్కర్, సానియా మంచి స్నేహితులు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అక్క ద్వారా సానియాను బుట్టలో వేసుకున్న అర్జున్.. వివాహం చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు.. అర్జున్ టెండూల్కర్ మాములోడు కాదని, అక్క ఫ్రెండ్‌నే పటాయించాడని కామెంట్ చేస్తున్నారు.