IPL 2022: అందుకే పృథ్వీ షాకు రూ.13 లక్షల జరిమానా!

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షాకి భారీ జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పృథ్వీ షా నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఐపీఎల్ నిబంధనల్ని ఉల్లఘించాడని మ్యాచ్ రిఫరీ అతనిపై చర్యలు తీసుకున్నాడు. పృథ్వీ షా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే పృథ్వీ షా చేసిన తప్పిదం ఏంటో ఆ ప్రకటనలో వెల్లడించలేదు. అతను ఎక్కడ నియమ నిబంధనల్ని ఉల్లఘించాడనే విషయంపై స్పష్టత లేదు.
రూ.13.25 లక్షలు నష్టం..
మ్యాచ్ రిఫరీ నిర్ణయం కారణంగా పృథ్వీ షా సుమారు రూ.13.25 లక్షలు నష్టపోనున్నాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ లెక్కన అతనికి ప్రతీ మ్యాచ్‌కు సుమారు 53 లక్షల మ్యాచ్ ఫీజు అందనుంది. దీని ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం అంటే రూ.13.25 లక్షలు పృథ్వీ షా నష్టపోనున్నాడు. అయితే ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటలో పృథ్వీ షా లెవల్ 1 తప్పిదానికి పాల్పిడినట్లు పేర్కొంది.
వాదించలేదు.. లొల్లి చేయలేదు..
ఈ నిబంధన ప్రకారం ఓ ఆటగాడు అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినా, అతనితో వాగ్వాదం చేసినా, మైదానంలో అసభ్యరంగా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటారు. కానీ పృథ్వీ షా మైదానంలో ఇలాంటి ప్రవర్తన మాత్రం కనబర్చలేదు. ఫీల్డింగ్ సమయంలో పృథ్వీ షా కనీసం ఒక్క క్యాచ్ కూడా అందుకోలేదు. ఒకవేళ క్యాచ్ పట్టి ఉంటే? అతిగా సంబరాలు చేసుకోవడం లాంటి తప్పిదాన్ని చేసి ఉంటాడని ఊహించొచ్చు. అలానే అతను బౌలింగ్ కూడా చేయలేదు.
అతిగా తింటున్నాడని..
ఇక పృథ్వీ షా తప్పిదానికి గల అసలు కారణం తెలియకపోవడంతో అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ షా అతిగా తింటున్నాడనే మ్యాచ్ రిఫరీ అతనిపై చర్యలు తీసుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాచ్ మధ్యలో మళ్లీ కాఫ్ సిరప్ తీసుకున్నాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో స్విగ్గీ నుంచి ఫిజ్జా తెచ్చుకొని తిన్నట్లున్నాడని, ఇది బీసీసీఐ సర్వీస్ చార్జ్ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పృథ్వీ షా వైఫల్యానికి 125 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించాలని మరొకరు కామెంట్ చేశారు.

బ్యాటింగ్ వైఫల్యంతో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 42 నాటౌట్), రిషభ్ పంత్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 44), మిచెల్ మార్ష్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బ్యాటర్ల ఉరుకులాట ఆ జట్టు ఓటమికి కారణమైంది. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసారు. ఈ విజయంలో లక్నో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications