For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఏంటి బ్రో ఇలా చేశావ్..?

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై భారత అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ చేసిన తప్పిదం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న సిరాజ్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్.. టీమిండియాను శతక్కొట్టాడు. జో రూట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగులు జోడించాడు.

దాంతో ఓటమి గండం తప్పించుకున్న ఇంగ్లండ్‌ విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షం, బ్యాడ్‌లైట్ కారణంగా నాలుగో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగియడంతో ఫలితం సాధ్యం కాలేదు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించలేదు. మరో 4 వికెట్లు తీస్తేనే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందుతుంది. అప్పుడే ఈ సిరీస్‌ సమమవుతోంది. లేదంటే ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంటుంది.

Fans Express Disappointment Over Mohammed Siraj s Fielding Blunders in IND vs ENG 5th Test

ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసే ఛాన్స్‌ను సిరాజ్ చేజార్చడంపై అభిమానులు నిట్టూరుస్తున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంత పోటీ ఇస్తుందంటే దానికి కారణం సిరాజ్. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకే ఆలౌటై వెనబడినప్పుడు సిరాజ్ జట్టును నిలబెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బజ్‌బాల్ గేమ్‌తో తొలి వికెట్‌కు 92 పరుగులు చేసిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 247 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్‌ను ఆలౌట్ చేసిన సిరాజ్.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ డేంజరస్ జాక్ క్రాలీ(14), ఓలీ పోప్‌(27)లను పెవిలియన్ చేర్చాడు. ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగగా.. తానొక్కడే పేస్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అతనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే జట్టును నిలబెట్టిన సిరాజ్.. ఒక్క తప్పిదంతో ఓటమికి కారణమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. క్యాచ్ పట్టి బౌండరీ తొక్కడంతో హీరో కాస్త విలన్‌గా మారడని పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరైతే 'ఏంటీ బ్రో ఇలా చేశావ్'అని నిట్టూరుస్తున్నారు.

Story first published: Monday, August 4, 2025, 14:55 [IST]
Other articles published on Aug 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+