Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలేదు కోహ్లీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

డియర్ విరాట్ కోహ్లీ.. నీ ఆకస్మిక నిర్ణయం బాలేదు. ఏ మాత్రం నచ్చలేదు.. మొన్ననే కదా ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌తో మమ్మల్ని ఆనందపరిచింది. అంతలోనే ఏమైంది నీకు.. మమ్మల్ని ఇంతలా బాధపెట్టే నిర్ణయాన్ని వెల్లడించావ్! ఇంగ్లండ్ పర్యటనలో నీ ఆటను ఆస్వాదిద్దామనకున్న మాకు ఇంత షాకివ్వడం నీకు సమంజసమా..? నీ రిటైర్మెంట్‌పై గత మూడు రోజులుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నా.. మౌనంగా ఉన్న నీవు ఎందుకీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నావ్.! నీ రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలు అవాస్తవాలంటూ మాజీ క్రికెటర్లు అనడం మాకు కొండంత అండనిచ్చింది! కానీ నీవు మాత్రం వాటన్నిటిని నిజం చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించడం.. మా గుండెలను పిండేస్తోంది.

క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్‌రొటేట్ చేస్తూ.. సొగసైన కవర్ డ్రైవ్స్‌తో బౌలర్ల సహనాన్ని పరీక్షించడం.. చూస్తుండగానే సెంచరీ అందుకోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య. బౌలర్ వికెట్ తీసినా.. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోవడం.. సహచర ఆటగాళ్లలో జోష్ నింపడం నీకు అలవాటైన ఆట. ఓటమిని ఏ మాత్రం సహించని నీ వైఖరి అద్భుతం. కొందరి దృష్టిలో నీవో సూపర్ హీరో అయితే.. మరికొందరి దృష్టిలో నీవో ఛోక్లివి మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్‌లో మా దృష్టిలో మాత్రం నీవో శిఖరం.!

Fans emotional message to Virat Kohli after Test retirement

అండర్ 19 ప్రపంచకప్‌తో తారా జువ్వలా భారత క్రికెట్‌లోకి నువ్వు దూసుకొచ్చిన విధానం.. వన్డే ప్రపంచకప్ 2011 ఫైనల్లో గౌతమ్ గంభీర్‌తో కలిసి నువ్వు ఆడిన కీలక ఇన్నింగ్స్.. ఇంకా మా కళ్ల ముందు కదలాడుతోంది. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ల్లో నువ్వాడిన అద్భుతమై ఇన్నింగ్స్‌లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో నువ్వు సాధించిన సెంచరీలు.. మా మదిలో నిలిచిపోయాయి.

టెస్ట్‌ క్రికెట్‌నే రసవత్తరంగా మార్చిన నీట.. మైదానంలో నీవు చూపించే దూకుడు.. నీ రికార్డుల మోత.. నీ మొక్కవోని ఫిట్‌నెస్ దీక్ష.. ఆట కోసం నిన్ను నువ్వు మార్చుకున్న తీరును ఎప్పటికీ మర్చిపోలేం. ప్రత్యర్థుల కవ్వింపులకు ఆటతోనో బదులివ్వడం నీకు మాత్రమే సాధ్యమైంది. కెప్టెన్‌గా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడినప్పుడు.. నీలో కనిపించిన బాధ మమ్మల్ని కదలించింది.

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో నువ్వు ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్‌కు మేం మురిసిపోయాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నీ ఆటను చూసి నీకు తిరుగులేదనుకున్నాం. ఐపీఎల్ 2025లో నీ నిలకడైన బ్యాటింగ్ చూసి ముచ్చటపడ్డాం. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 టైటిల్‌ను అందుకొని ఆటకు సగర్వంగా నీకు వీడ్కోలు పలకాలని కలలు కన్నాం. కానీ నీ ఈ నిర్ణయం మా కలలను కల్లలు చేసింది. కనీసం ఆ వన్డే క్రికెట్, ఐపీఎల్ అయిన ఇంకొన్నేళ్లు ఆడు కోహ్లీ.. ప్లీజ్! - మైఖేల్ తెలుగు

Story first published: Monday, May 12, 2025, 13:26 [IST]
Other articles published on May 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+