For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్.. నీ ఇంటర్నేషనల్ కెరీర్ ఖేల్‌ఖతమ్.. పోయి ఐపీఎల్ ఆడుకోపో! మండిపడుతున్న ఫ్యాన్స్!

Fans disappointed after Sanju Samson squanders another chance in international cricket

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఈ కేరళ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా కీలకమైన చివరి మ్యాచ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశ పరిచాడు. తొలి టీ20లో 27 రన్స్ చేసిన శాంసన్.. రెండో టీ20లో 7 పరుగులే చేశాడు. అటు కీపర్‌గా విఫలమయ్యాడు. అతని చెత్త కీపింగ్ కారణంగా రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. ఇక కీలక టీ20 ప్రపంచకప్ ముందు దొరికిన బంగారంలాంటి అవకాశాన్ని సంజూ చేజేతులా నాశనం చేసుకున్నాడు. దాంతో సంజూ ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని అభిమానులు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

సంజూ.. నీ కెరీర్ ఖేల్ ఖతమ్

సంజూ శాంసన్ కెరీర్ ముగిసిందని, మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం దక్కకపోవచ్చని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే.. క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని సూచిస్తూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు కొనియాడటం ఇకనైన మానాలని, అతను అంతర్జాతీయ క్రికెట్‌కు పనికిరాడని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ జరుగుతున్నప్పుడల్లా అతన్ని కొనియాడే ఇయాన్ బిషప్‌ను అలా చేయవద్దని సూచిస్తున్నారు. సంజూ శాంసన్‌ స్పిన్ ఆడలేకపోతున్నాడని, ముందుగా దేశవాళీ క్రికెట్‌లో అది మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు.

ఎవడ్రా అక్కడ సంజూ బెస్ట్ ప్లేయర్ అన్నది..?

ఇక సంజూ శాంసన్‌ను బెస్ట్ ప్లేయర్ అన్నది ఎవరని, డాక్టర్ దగ్గరకు వెళ్లి కళ్లు చూపించుకోవాలని సెటైర్లు పేల్చుతున్నారు. అతనికిచ్చిన మూడు అవకాశాలను చేజార్చుకున్నాడని, అతనికి జట్టులో అవకాశం ఇవ్వడం దండగని కామెంట్ చేస్తున్నారు. 10 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో మొత్తం 117 రన్స్ మాత్రమే చేశాడని, 27 పరగులే హయ్యెస్ట్ అని, ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అతనికి స్పిన్ ఆడటం తెలియడం లేదని, ముందు అది నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

ఐపీఎల్ ఆడుకోపో..

ఇక ఐపీఎల్ ప్లేయర్లను నమ్ముకోవడం వృథా అని మరో అభిమాని కామెంట్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, నితీశ్ రాణాలు దారుణంగా విఫలమయ్యారని, వీళ్లంతా ఐపీఎల్‌కే పరిమితమని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇక సంజూ శాంసన్‌కు ఐపీఎలే దిక్కని, అక్కడే ఆడుకోవాలని సూచిస్తున్నారు. సంజూ శాంసన్‌తో పాటు శిఖర్ ధావన్ సెలెక్టర్ల పని సులువు చేశారని, ఈ ఇద్దరూ టీ20 ప్రపంచకప్ బెర్త్ కోల్పోయారని కామెంట్ చేస్తున్నారు.

శ్రీలంకదే సిరీస్

శ్రీలంకదే సిరీస్

చివరి టీ20లో అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలుచుకొని వన్డే సిరీస్‌కు బదులు తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 రన్స్ మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాప్-5 బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్(0), దేవదత్ పడిక్కల్(9), సంజూ శాంసన్(0), రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా(6) దారుణంగా విఫలమయ్యారు. బర్త్‌డే బాయ్ వానిందు హసరంగ(4/9) 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా డసన్ షనక రెండు వికెట్లు తీశాడు. అనంతరం శ్రీలంక ఆడుతూ పాడుతూ 14.3 ఓవర్లలో మూడు వికెట్లకు 82 రన్స్ చేసి విజయాన్నందుకుంది. రాహుల్ చాహర్(3/15) మూడు వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. ధనుంజయ డిసిల్వా(19 బంతుల్లో 2 ఫోర్లు 23 నాటౌట్) మరోసారి కడవరకు నిలిచి విజయాన్నందించాడు.

Story first published: Thursday, July 29, 2021, 23:26 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+