Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓరి మీ పీఆర్ వేషాలో..?

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరింది. బుధవారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఆసీస్ ఫ్లైట్ ఎక్కింది. టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా జట్టుతో కలిసి ఆసీస్ బయల్దేరారు. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం ఆటకు దూరమైన ఈ ఇద్దరూ ఆటగాళ్లు.. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నారు.

టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్-కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 గెలిచి సగర్వంగా తమ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు. అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. రోహిత్ శర్మ అయితే 20 కేజీల బరువు తగ్గి సన్నగా మారాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు.

Fans Criticize Rohit Sharma and Virat Kohli for Alleged PR Stunts

స్క్రిప్ట్ ప్రకారమే పీఆర్ స్టంట్స్..?

అయితే ఈ ఇద్దరి రీఎంట్రీ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న కొన్ని వీడియోలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల ఆటకు దూరమైన ఈ ఇద్దరూ ఆటగాళ్లు లైమ్ లైట్‌‌లోకి వచ్చేందుకు పీఆర్ స్టంట్స్ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి వీడియోలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొంటున్నారు.

ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ ముంబైలోని ఓ స్థానిక స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఓ వైపు రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగానే.. అతని పీఆర్‌ టీమ్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రాక్టీస్‌లో రోహిత్ భారీ సిక్స్‌లు కొట్టిన వీడియోలు, అతని కోసం అభిమానులు ఎగబడిని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అంతేకాకుండా రోహిత్ సిక్స్‌కు అతని కారు అద్దం పగిలిందని.. ఓ చిన్న పిల్లాడిని సెక్యూరిటీ అడ్డుకోగా రోహిత్ వారిపై గట్టిగా అరవడం వంటి వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది. అయితే ఈ వీడియోలను స్క్రిప్ట్ ప్రకారమే రూపొందించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

డబ్బా కొట్టడంలో తగ్గేదేలే..

ఆసీస్ బయల్దేరేందుకు ఢిల్లీ విమానాశ్రయం చేరిన రోహిత్ చుట్టూ అభిమానులు చేరి సెల్ఫీలు తీసుకోవడం కూడా పీఆర్ స్టంట్ అని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కోహ్లీ పీఆర్స్ కూడా తాము తక్కువేం కాదన్నట్లు వ్యవహరించారని అభిప్రాయపడుతున్నారు.

కోహ్లీ.. భారత్‌లోకి అడుగుపెట్టడమే ఆలస్యం అతని పీఆర్‌లు స్క్రిప్ట్ ప్రకారం స్టంట్స్ వేసారని గుర్తు చేస్తున్నారు. కోహ్లీ అడుగుపెట్టిన వీడియోతో పాటు విమానాశ్రయంలో బస్సులో ఉన్న కోహ్లీ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం వంటి వీడియోలను ప్రణాళిక ప్రకారమే రూపొందించారని ఆరోపిస్తున్నారు.

Story first published: Wednesday, October 15, 2025, 13:54 [IST]
Other articles published on Oct 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+