For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భయ్యా.. నువ్వు దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్!

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌‌లకు ఐదు విఫలమవడంతో ఓపెనర్‌గా సంజూ శాంసన్ కథ ముగిసింది. మరోవైపు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లొ టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు.

తిరువనంతపురం టీ20కి ముందే టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం చెలరేగాడు. దాంతో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్.. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్‌కు ప్రమోషన్‌గా వికెట్ కీపింగ్ చేసే అవకాశం లభించింది.

Fans Call Sanju Samson an Unlucky Brand Ambassador After Disappointing Performance in New Zealand T20Is

వాటర్‌బాయ్‌గా సంజూ శాంసన్..

గాయంతో జట్టుకు దూరంగా ఉన్న తిలక్ వర్మ అందుబాటులోకి వస్తే సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. 12వ ఆటగాడిగా వాటర్ బాటిల్స్ మోయడం, సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేయడం వంటి పనులు చేయనున్నాడు. ఎవరైనా బ్యాటర్ గాయపడితే సంజూకు తుది జట్టులో చోటు దక్కనుంది.

సంజూ శాంసన్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. అతని తలరాతో లేక మరే కారణమో తెలియదు కానీ సంజూ ఇలానే చివరి నిమిషంలో ఇప్పటికే ఎన్నో అవకాశాలను చేజార్చుకున్నాడు. గత టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో సభ్యుడిగా ఉన్న సంజూ శాంసన్.. రిషభ్ పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం సంజూను పక్కనపెట్టారు.

దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న సంజూ శాంసన్.. భారీ శతకాలతో చెలరేగాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. మెరుగ్గా రాణిస్తున్న క్రమంలో శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్ మిడిలార్డర్‌కు డిమోట్ చేశాడు. దాంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన సంజూ వరుసగా విఫలమై తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఫినిషర్ పేరిట జితేష్ శర్మతో మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసింది.

శుభ్‌మన్ గిల్ కూడా విఫలమవడంతో అతన్ని తప్పించి మళ్లీ సంజూకు అవకాశం ఇవ్వగా.. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ మెగా టోర్నీకి ముందు కీలకమైన సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో సంజూ విఫలమవడం.. గాయంతో దూరమైన తిలక్ వర్మ స్థానంలో ఆడిన ఇషాన్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చడం కేరళ బ్యాటర్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే సంజూ‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సంజూ శాంసన్ అంత దురదృష్టవంతులుడు మరొకరు లేరని, దరిద్రానికే అతను బ్రాండ్ అంబాసిడర్ అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, February 1, 2026, 12:18 [IST]
Other articles published on Feb 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+