For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌పై మీకన్నా శ్రీలంక బాగా ఆడింది! కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండి.. అప్పుడుగాని గెలవరు!

Fans brutally trolls Pakistan cricket team for defeat in 1st ODI vs England

కరాచీ: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పటిష్ట పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ ద్వితీయ శ్రేణి జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ దిగిన పాకిస్తాన్‌.. ఇంగ్లండ్‌ పేసర్‌ షకీబ్ మహమూద్ దెబ్బకు 35.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 142 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఆదిలోనే ఓపెనర్‌ ఫిల్ సాల్ట్ వికెట్‌ కోల్పోయింది.అయితే మరో ఓపెనర్‌ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది.

9 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు

9 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు

శ్రీలంక పర్యటన అనంతరం పాకిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు ఇంగ్లండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో ఇంగ్లండ్‌ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో తొమ్మిది మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు.

సీనియర్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది ఈసీబీ. పాక్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్‌లో ఏకంగా ఐదుగురు వ‌న్డేల్లో అరంగేట్రం చేశారు. దీంతో ఈ సిరీస్‌లో పాకిస్థానే హాట్ ఫేవ‌రెట్ అని అంతా భావించారు. కానీ తొలి వ‌న్డేలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. 141 ప‌రుగుల‌కే పాక్ బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు.

శ్రీలంక ఇంత‌కన్నా బాగా ఆడింది

పూర్తి బ‌లగంతో ఉన్న పాకిస్థాన్‌ను ఇంగ్లండ్‌ ద్వితీయ శ్రేణి జట్టు చిత్తు చిత్తుగా ఓడించడంతో పాక్ ఫాన్స్ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పాక్ టీమ్ ప‌రువు తీశారు. వరుస మీమ్స్, ట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 'ఫుల్ స్ట్రెంత్‌తో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌పై శ్రీలంక ఇంత‌కన్నా బాగా ఆడింద‌ని మ‌రొక‌రు కామెంట్ చేయగా.. 'కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండి! అప్పుడు గాని మీరు గెలవరు' అని ఇంకోకారు కామెంట్ చేశారు.

'ప్రతి విభాగంలో పాకిస్తాన్ విఫలమైంది. ఇది ఓ మేల్కొలుపు', 'ఈ నిరాశ మరియు అవమానం చాలు. నేను ఫుట్‌బాల్‌ను చూడటం ఇందుకే ప్రారంభించా. ఓ మై గాడ్.. యూరో 2020 ఎంజాయ్ చేస్తున్నా' అంటూ పాక్ నెటిజన్లు మండిపడుతున్నారు.

Sri Lanka vs India: నేను ఫామ్‌ కోల్పోలేదు.. శ్రీలంక సిరీస్‌లో కొత్త యూజీని చూస్తారు: చహల్‌

ప్రధాన జట్టు ఐసొలేషన్‌కు

గతవారమే ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేయగా.. మూడు వన్డే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. అయితే ఈ మ్యాచులలో లంక బాగానే పోరాడింది. అందుకే పాక్ ఫాన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంగీష్ జట్టులోని ముగ్గురు ప్లేయర్స్ కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రధాన జట్టు ఐసొలేషన్‌కు వెళ్లిపోయిది. అప్పటికే పాక్ సిరీస్ షెడ్యూల్ అయి ఉండడంతో.. మరో జట్టును ఈసీబీ ఎంపికచేసింది.

జట్లు

పాకిస్తాన్: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, సోహైబ్ మక్సూద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్.

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, డేవిడ్ మలన్, జాక్ క్రాలే, జేమ్స్ విన్స్, బెన్ స్టోక్స్, జాన్ సింప్సన్, లూయిస్ గ్రెగొరీ, క్రెయిగ్ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పార్కిన్సన్.

Story first published: Friday, July 9, 2021, 14:28 [IST]
Other articles published on Jul 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+