Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sri Lanka vs India: నేను ఫామ్‌ కోల్పోలేదు.. శ్రీలంక సిరీస్‌లో కొత్త యూజీని చూస్తారు: చహల్‌

Indian spinner Yuzvendra Chahal says You will see new Yuzi in Sri Lanka series

కొలంబో: తాను ఫామ్‌ కోల్పోలేదని టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్‌ అంటున్నాడు. మరింత వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్నానని, శ్రీలంక సిరీస్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన యూజీని చూస్తారన్నాడు. ఓ సీనియర్‌ ఆటగాడిగా జూనియర్లను నడిపించాలని కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ తనకు సూచించారని చహల్‌ చెప్పాడు. శ్రీలంక పర్యటనతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13న వన్డే సిరీస్.. జూలై 22 టీ20ల సిరీస్ ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌కి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు.

ఫామ్‌ కోల్పోలేదు

ఫామ్‌ కోల్పోలేదు

ప్రస్తుతం కొలంబోలో ఉన్న యుజ్వేంద్ర చహల్‌ మాట్లాడుతూ... 'నా బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. నేను దానిపైనే దృష్టి పెట్టాను. ఇతర బంతులు వేయడం లేదు. శ్రీలంక సిరీసులో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో నిండిన చహల్‌ను చూస్తారు. నేను ఫామ్‌ కోల్పోయానని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడం కుదరదు. అయితే ఎప్పుడూ కూడా బాగా ఆడేందుకు శ్రమిస్తాను. వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో పాలుపంచుకోవడానికే చూస్తాను. శ్రీలంక సిరీస్ నాకెంతో కీలకం' అని తెలిపాడు. యూజీ భారత్ తరఫున 54 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. అయితే ఇప్పటివరకు టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.

ద్రవిడ్‌ అదే చెప్పారు

ద్రవిడ్‌ అదే చెప్పారు

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనతో మాట్లాడారని యుజ్వేంద్ర చహల్‌ చెప్పాడు. 'సీనియర్‌గా యువకులను నడిపించాలని కోచ్ ద్రవిడ్‌ నాకు చెప్పారు. ఇది నాకు ముఖ్యమైన సిరీసని కూడా గుర్తు చేశారు. నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేయమని, అయితే చేస్తున్న పనిపై పూర్తి దృష్టిని సారించాలని సూచించారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి' అని చహల్‌ పేర్కొన్నాడు.

టీ20లతో పోలిస్తే వన్డేలు కాస్త భిన్నమేనని చహల్‌ అన్నాడు. తనకు 54 వన్డేలు ఆడిన అనుభవం ఉందని, తన దృష్టంతా బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయడం పైనే ఉంటుందని తెలిపాడు. ఈ సిరీసును బయో బుడగలో ఉండే ఆడుతున్నామని, అది సురక్షితంగానే ఉంటుందని మణికట్టు స్పిన్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

Sri Lanka vs India: ద్రవిడ్‌ను చూసే.. మేము జయవర్దనేను ఒప్పించేందుకు ప్రయత్నించాం: డిసిల్వా

ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో మెరిసిన యూజీ

ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో మెరిసిన యూజీ

శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు ప్రా‍క్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్‌ కనబరుస్తున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లు గురువారం ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ సందర్భంగా బౌలింగ్‌లో మెరిశారు. నితీష్‌ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్‌ తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో సత్తాచాటాడు. నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్‌, చేతన్‌ సకారియాలు కూడా వికెట్లతో మెరిశారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్‌ యూట్యూబ్‌ చానెల్‌లో షేర్‌ చేసింది. ఇక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ల సారధ్యంలో రెండు జట్లుగా విడిపోయిన టీమిండియా.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లను ముగించుకున్నాయి.

Story first published: Friday, July 9, 2021, 13:29 [IST]
Other articles published on Jul 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+