పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన పంతం నెగ్గించుకున్నాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని బెంచ్‌పైనే కూర్చోబెట్టాడు. 15 ఏళ్ల కుర్రాడి కోసం జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనపెట్టలేనని పరోక్షంగా వెల్లడించాడు. వండర్ కిడ్ అయినా.. సెన్సేషన్ అయినా తన ముందు సాధారణ ఆటగాడేనని స్పష్టం చేశాడు.
గంభీర్ చర్యతో అంతర్జాతీయ అరంగేట్రం చేయాల్సిన వైభవ్ సూర్యవంశీ డ్రింక్స్ బాయ్‌గా మారిపోయాడు. రవి బిష్ణోయ్‌తో కలిసి డ్రింక్స్ మోస్తూ కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ పాపం బుడ్డోడంటూ కామెంట్ చేస్తున్నారు. 15 ఏళ్ల కుర్రాడితో వాటర్ బాటిల్స్ మోయించడం ఏంటని మండిపడుతున్నారు. పసికూన ఐర్లాండ్‌తో వైభవ్‌కు అవకాశం ఇస్తే ఏమయ్యేదని గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం హైప్ తీసుకొచ్చారు. అభిమానులు కూడా వైభవ్ అరంగేట్రం పక్కా అని భావించారు. కానీ గంభీర్ తీరు తెలిసిన చాలా మంది మాజీ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యమవుతుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా వైభవ్ ఆడటం లేదని హింట్ ఇచ్చాడు.
అయినా బుడ్డోడికి అవకాశం ఇస్తారని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ శుక్రవారం ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గంభీర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రస్తుత జట్టులో వైభవ్ కంటే బాగా ఆడే ఆటగాళ్లు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. సెలెక్టర్లు వైభవ్‌ను ఎంపిక చేసి ఐర్లాండ్ పంపించినా.. హెడ్ కోచ్ గంభీర్ కుర్రాడి అరంగేట్రాన్ని అడ్డుకున్నాడని ఆరోపిస్తున్నారు.
ఈ ఒక్క మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే టీమిండియాకు ఏమైనా నష్టం జరిగేదా? అని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగి ఉంటే 15 ఏళ్ల 91 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కేవాడు. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టేవాడు. కనీసం రెండో టీ20 మ్యాచ్‌లోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

