మరో సెహ్వాగ్‌ను మిస్సవుతున్నారు..
సోషల్ మీడియా వేదికగా సెలెక్షన్ కమిటీపై దుమ్మెత్తి పోస్తున్నారు. సెలెక్టర్ల పక్షపాత ధోరణీ కారణంగా టీమిండియా మరో సెహ్వాగ్‌ను మిస్సవుతుందని మండిపడుతున్నారు. రంజీ ట్రోఫీలో ముంబైకి సారథిగా వ్యవహరిస్తున్న పృథ్వీ షా.. గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నా అతన్ని పరిగణలోకి తీసుకుంటలేరని వాపోతుననారు. మరో సెహ్వాగ్ అవుతాడని భావిస్తున్న పృథ్వీ షాకు ఇలా అవకాశాలివ్వకపోవడం దారుణమంటున్నారు. భారత జట్టులో చోటు కల్పించకపోవడంపై అతడు చేసిన పాపమేంటని బీసీసీఐని కడిగిపారేస్తున్నారు.
నీ విలువ ఏంటో తెలుస్తోంది..
'ఐర్లాండ్ టూర్ లో పృథ్వీ షా ను తీసుకోలేదు. ఇది చాలా దారుణం..'అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. 'షా చేసిన తప్పేంటి..? బాగా ఆడటమే అతడి తప్పా చెప్పండి..?'అని మరొకరు.. 'బాధపడకు షా.. సూర్యుడు తూర్పున ఉదయించక మానడు.. నువ్వు టీమిండియాలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు..'అని మరొకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. 'ఈరోజు నీది కాదు. కానీ నీ విలువేంటో వాళ్ల (సెలెక్టర్ల)కు తర్వాత తెలుస్తుంది.'సెలెక్టర్లపై సెటైర్లు పేల్చుతున్నారు.
పృథ్వీ షాకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలి..
'భారత్‌లో ప్రస్తుతం ధాటిగా ఆడే యువ ఆటగాళ్లలో షా ఒకడు. అతడినే పక్కనబెడితే ఎలా..?', 'ఇదేం జట్టు ఎంపిక..? షాను ఎంపిక చేయరా..' అని బీసీసీఐకి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన షా.. 10 మ్యాచుల్లో 283 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో డేవిడ్ వార్నర్ తో కలిసి ధాటిగా ఆడి ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. సెహ్వాగ్ తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేసే షాకు ఎక్కువ అవకాశాలివ్వాలని క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టు:
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్


Click it and Unblock the Notifications












