Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: శుభ్‌మన్ గిల్ మళ్లీ అదే తప్పిదం.. ఇంగ్లండ్‌కు వరం!

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తడబడుతున్నాడు. సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నాడు. రెండో రోజు ఆటలో చేసిన తప్పిదాలనే మూడో రోజు కొనసాగించాడు. బౌలింగ్ మార్పుల, ఫీల్డ్ సెటప్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. శుభ్‌మన్ గిల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా? డ్రెస్సింగ్ రూమ్ ఆదేశాలను పాటిస్తున్నాడా? అనేది తెలియదు కానీ కెప్టెన్‌గా అతని తప్పిదాలు టీమిండియా కొంపముంచాయి. బంతి టర్న్ అవుతున్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌తో బౌలింగ్ చేయించలేదు. ఇది ఘోర తప్పిదమని కామెంటేటర్లు శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు గుప్పించారు. 68 ఓవర్ల ఆట ముగిసే వరకు సుందర్‌కు గిల్ బంతి ఇవ్వలేదు.

శుభ్‌మన్ గిల్ తప్పిదం.. ఇంగ్లండ్ జట్టుకు వరంగా మారింది. 225/2తో రెండో ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. జో రూట్, ఓలీ పోప్ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. దాంతో ఇంగ్లండ్ తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 332/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

Fans Blame Shubman Gill s Captaincy Blunders for India s Struggles on Day 3 of 4th Test vs England

రెండో సెషన్ ఆరంభంలోనే వాషింగ్టన్ సుందర్‌కు శుభ్‌మన్ గిల్ బంతినిచ్చాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్.. తన ఐదో ఓవర్‌లో సెంచరీ దిశగా సాగుతున్న ఓలీ పోప్(71)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 144 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తన ఏడో ఓవర్‌లో డేంజరస్ హ్యారీ బ్రూక్(3)ను సుందర్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో గిల్‌కు తాను చేసిన తప్పిదం ఏంటో అర్థమై ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తొలి సెషన్‌లోనే సుందర్‌తో బౌలింగ్ చేయించి ఉంటే ఇంగ్లండ్ భారీ భాగస్వామ్యం నమోదు చేసేది కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం శుభ్‌మన్ గిల్‌కు అండగా నిలుస్తున్నారు. బంతి పాతబడే వరకు సుందర్‌కు బౌలింగ్ ఇవ్వద్దనే గిల్ ఇలా చేశాడని సమర్థిస్తున్నారు.

Story first published: Friday, July 25, 2025, 18:57 [IST]
Other articles published on Jul 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+