For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆమె వల్లే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌‌కు వీడ్కోలు పలకి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అభిమానులతో పాటు హర్భజన్ సింగ్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇంకొన్నాళ్లు కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డారు. భారత జట్టులోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీ.. మరో మూడేళ్ల పాటు ఆటలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ 36 ఏళ్ల వయసులోనే కోహ్లీ ఆటకు అల్విదా ప్రకటించాడు.

కోహ్లీ ఆకస్మిక నిర్ణయంతో సెలెక్టర్లు డైలామాలో పడ్డారు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు సవాల్‌గా మారింది. అయితే రిటైర్మెంట్ ప్రకటించవద్దని కోహ్లీని బీసీసీఐ బుజ్జిగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎవరి మాట వినని కోహ్లీ.. సంతృప్తికరంగా ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

Fans Blame Anushka Sharma for Virat Kohli s Early Test Retirement

అనుష్క పోరు భరించలేకనే..
అయితే కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక అతని సతీమణి అనుష్క శర్మ ఉందని కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి టైమ్ ఇచ్చేందుకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని, అనుష్క శర్మ ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. అనుష్క శర్మ ఆడించినట్లు కోహ్లీ ఆడుతున్నారని, ఇప్పటికే ఈ జంట ఇంగ్లండ్‌లో కాపురం పెట్టిందని, పూర్తిగా అక్కడే సెటిల్ అవ్వనున్నారని అభిప్రాయపడుతున్నారు.

అనుష్క శర్మ కారణంగానే కోహ్లీకి ఆటపై ఉన్న ఆసక్తి తగ్గిందని ఆరోపిస్తున్నారు. అనుష్క శర్మ సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. సచిన్ 40 ఏళ్ల వరకు ఆడేలా అంజలి ప్రోత్సహించిందని గుర్తు చేస్తున్నారు. అనుష్క శర్మ మాత్రం కోహ్లీని బ్లాక్‌మెయిల్ చేసిందని మండిపడుతున్నారు. కోహ్లీ విషయంలో అనుష్క శర్మను తప్పుబట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కోహ్లీ విఫలమైన సందర్భంలో కొందరు ఫ్యాన్స్ అనుష్క శర్మపై ట్రోలింగ్‌కు దిగారు.

నీ కన్నీళ్లను చూశాను..
మరోవైపు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌‌పై అనుష్క శర్మ స్పందిస్తూ.. భావోద్వేగానికి గురైంది. 'అభిమానులు.. నీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడుతారు. కానీ నేను నువ్వు ఎప్పుడూ చూపించని కన్నీళ్లను, ఎవరూ చూడని పోరాటాలను ఈ ఫార్మాట్‌పై మీరు చూపిన ప్రేమను చూశాను. ఈ ఆట నీ నుంచి ఎంత తీసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత కొంచెం తెలివిగా, వినయంగా తిరిగి వస్తారు. నీ ఎదుగుదలను చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. వైట్ జెర్సీలో ఆడుతూ రిటైర్ అవుతావని భావించాను. కానీ నువ్వు నీ మనసు మాట విన్నావు. ఈ వీడ్కోలుకు నువ్వు అర్హుడవి'అని అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఈ పోస్ట్‌కు కోహ్లీ లవ్ ఏమోజీలతో స్పందించాడు.

Story first published: Monday, May 12, 2025, 16:59 [IST]
Other articles published on May 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+