IND vs IRE: గంటకు 208 కిలోమీటర్ల వేగం.. భువనేశ్వర్ కుమార్ ముందు ఉమ్రాన్, అక్తర్ జుజుబీ!

డబ్లిన్: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పీడ్ మీటర్ ఏకంగా ఆ బంతి వేగాన్ని గంటకు 201 కిలోమీటర్లుగా చూపించింది. దాంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు.
అసలు అంత వేగంతో బంతి విసిరాడా? అయితే వరల్డ్ రికార్డు నమోదైనట్లేనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ అది స్పీడ్ మీటర్ తప్పిదమని తేలడంతో సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు.
అక్తర్ రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. అతను 161.3 కిలోమీటర్ల వేగంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఆ తర్వాత ఈ రికార్డును మరేవరూ అందుకోలేకపోయారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే టీమిండియా పిలుపును అందుకొని ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.
స్పీడ్ మీటర్ తప్పిదంతో..
అయితే సాంకేతిక లోపంలో భువీ వేసిన బంతి వేగం తప్పుగా చూపించడంతో అతని ముందు అక్తర్, ఉమ్రాన్ మాలిక్‌లు కూడా పనికిరారని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. వరల్డ్ రికార్డు బద్దలైందంటూ స్పీడ్ మీటర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.
చెలరేగిన హుడా..
భువనేశ్వర్ కుమార్ (1/16), యుజ్వేంద్ర చాహల్ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్ ( 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఆతిథ్య జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. అనంతరం దీపక్ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్), ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ), హార్దిక్ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications