For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్ కాదు.. వారి వల్లే ఈ ఘోర ఓటమి!

సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్‌ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయం అనంతరం మైదానంలోనే గంభీర్‌కు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.

గంభీర్‌కు వ్యతిరేకంగా గౌహతి ప్రేక్షకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఇతర సహాయక సిబ్బంది వారించినా అభిమానులు వెనక్కి తగ్గలేదు. గట్టిగా అరుస్తూ గంభీర్‌ను ఎగతాళి చేశారు. అభిమానుల నిరసనల మధ్యే గంభీర్‌ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.

ఆటగాళ్లు ఆడకపోతే గంభీర్ ఏం చేస్తాడు?

అయితే ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే గంభీర్ ఏం చేస్తాడని అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గంభీర్ హెడ్ కోచ్ మాత్రమేనని, సలహాలు, సూచనలు, వ్యూహాలు చేయడమే అతని పనని గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేకపోతున్నారనేది నగ్న సత్యం.

Fans Back Gautam Gambhir Blame Indian Batters for 2 0 Whitewash Against South Africa

దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడం వల్లే ఇలా జరుగుతుందని హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గంభీర్ నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నాడు. కానీ ఏ ఆటగాడు అతని మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. న్యూజిలాండ్‌‌తో క్లీన్ స్వీప్‌కు తాజాగా సౌతాఫ్రికాతో వైట్‌వాష్‌కు భారత బ్యాటర్ల వైఫల్యమే కారణమని చెబుతున్నారు.

స్పిన్ ఆడలేక..

టీమిండియా ఆటగాళ్లు స్వీప్ షాట్స్ ఆడలేకపోతున్నారని, ఓపికగా డిఫెన్స్ చేయలేకపోతున్నారని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. ప్రత్యర్థి బ్యాటర్లు స్వీప్ షాట్స్‌తో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. భారత బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్ ఆడలేకపోతున్నారని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు.

ఈ బలహీనతపై భారత బ్యాటర్లు ఫోకస్ పెట్టాలని సూచించాడు. స్పిన్ బలహీనతను పెట్టుకొని గంభీర్‌ను విమర్శించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు సురేశ్ రైనా సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు.

బ్యాటర్లను తిట్టకుండా..

భారత ఓటమికి కారణమైన ఆటగాళ్లను నిందించకుండా గంభీర్‌పై విమర్శలు గుప్పించడం ఏంటని అతని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ కోచ్‌ కూడా ఇలా విమర్శలు ఎదుర్కోలేదని గుర్తు చేస్తున్నారు. గంభీర్ పర్యవేక్షణలోనే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందని, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిందని గుర్తు చేసుకుంటున్నారు.

జట్టును సెట్ చేసేందుకు గంభీర్ తన వంతు ప్రయత్నిస్తున్నాడని, కానీ అతని ప్రయోగాలు ఫలించకపోవడంతో పదే పదే మార్పులు చేస్తున్నాడని వెనకేసుకొస్తున్నారు. కోచ్‌గా గంభీర్ తప్పిదాల కంటే టీమిండియా ఆటగాళ్ల వైఫల్యమే జట్టు ఘోర పరాజయాలకు కారణమని చెబుతున్నారు. వాటి గురించి మాట్లాడకుండా గంభీర్ ఒక్కడినే నిందించడం సరికాదంటున్నారు. పాపం గంభీర్ అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, November 27, 2025, 18:00 [IST]
Other articles published on Nov 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+