గంభీర్ వద్దు.. కోచ్‌గా లచ్చన్నన్నే కొనసాగించండి!
జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసిన టీమిండియా.. తమ వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. పసికూన ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అయిన భారత్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించలేకపోయిన భారత్.. జింబాబ్వే పర్యటనలో ఊరట విజయాన్ని అందుకుంది.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి విజయం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చగా.. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

అయితే ఈ పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దూరంగా ఉండగా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని సపోర్ట్ స్టాఫ్ కూడా టీమిండియాకు సేవలందిస్తుంది. గంభీర్‌తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్‌కు ఈ పర్యటనను విశ్రాంతి కల్పించారు.
వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో టీమిండియా తొలి విజయం సాధించడంతో ఆయననే హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బౌలింగ్ బాగుందని, అనుభవం లేని బౌలర్లతో లక్ష్మణ్ జట్టును నడిపించిన తీరు అమోఘమని కొనియాడుతున్నారు. కనీసం టీ20 ఫార్మాట్‌లోనైనా లక్ష్మణ్‌ను కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐని కోరుతున్నారు. టీమ్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధెవెరే(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39), తడివానషే మరుమాని(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(2/18), ప్రిన్స్ యాదవ్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 3 ఫోర్లతో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ రెండు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

