For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ బ్రో.. సారా టెండూల్కర్ హ్యాండిచ్చిందా? ఆ పోస్ట్‌లు ఏంది?

Fans Ask Shubman Gill to Sara Tendulkar Break up With You? After He Posts Instagram Picture

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత రెండేళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి ఈ ఇద్దరూ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అలాగని ఈ రూమర్స్‌ను ఖండించలేదు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వీరు పెట్టిన కొన్ని పోస్టులు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. దాంతో ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా శుభ్‌మన్ గిల్ షేర్ చేసిన ఫొటో నెటిజన్లను గందరగోళంలోకి నెట్టింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోని శుభ్​మన్ గిల్ ప్రస్తుతం ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. తరచూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతను ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ ఫొటోలో బ్లాక్ టీషర్ట్ ధరించిన శుభ్‌మన్ గిల్.. దానిపై 'ఏంజెల్స్‌తో ప్రేమలో పడకూడదు'అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు షాకయ్యారు. అతనికి ఏమైందని కామెంట్ చేస్తున్నారు. సారా టెండూల్కర్‌తో బ్రేకప్ అయిందా? అని సందేహిస్తున్నారు.

ఐ స్పై కామెంట్‌‌తో షురూ..

ఐ స్పై కామెంట్‌‌తో షురూ..

శుభ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్ సామాజిక మాధ్యమాల్లో చాలాకాలంగా ఒకరినొకరు అనుసరిస్తున్నారు. ఇద్దరు అనేక విషయాల్లో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా శుభ్‌మన్‌ ఇన్‌స్టాలో ఓ అందమైన ఫొటో పోస్ట్‌ చేశాడు. మనోహరమైన ప్రదేశంలో బెంచ్‌పై కూర్చొని.. కాలుమీద కాలువేసుకుని ఉన్నాడు. ఆ ఫోటోకి 'ఐ‌ స్పై‌' అని కాప్షన్ పెట్టాడు. రెండు ఎమోజీ (కళ్లు)లను కూడా జత చేశాడు. మరోవైపు అదే సమయానిక్ సారా కూడా తన అందమైన ఫొటో పెట్టి 'ఐ‌ స్పై‌' అని పోస్ట్‌ చేయడమే కాకుండా అవే ఎమోజీలను కూడా పెట్టారు. శుభ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫొటోలు వారి వ్యక్తిగతమైనవే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్య పెట్టడంతో.. మళ్లీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్

ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్

ఆ మధ్య శుభ్‌మన్‌ గిల్‌ తనలోని ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్‌ను అభిమానులకు పరిచయం చేసాడు. ఓ ఫొటోలో బ్యాగ్రౌండ్‌ ఒకే విధంగా కనబడేలా.. ఓవైపు వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నట్టు, మరోవైపు కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఎడిటింగ్‌ చేశాడు. ఈ ఫొటోను శుభ్‌మన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి.. 'ఒకరు పనిపై శ్రద్ద చూపిస్తుంటే.. మరొకరు చిల్ అవుతున్నారు' అని కామెంట్ పెట్టాడు. అప్పడు సారా.. గిల్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై కామెంట్ చేసారు. 'ఆ ఎడిటింగ్‌ అతనే చేశారని భావిస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. ఆ కామెంట్ కారణంగా శుభ్‌మన్‌, సారా వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు అప్పుడే మొదలయ్యాయి.

హార్దిక్ పాండ్యా కామెంట్‌తో..

హార్దిక్ పాండ్యా కామెంట్‌తో..

గతేడాది గిల్‌ ఓ కారుకొంటే అందుకు సారా అభినందనలు తెలియజేసారు. అప్పుడు వెంటనే 'నీ బదులు సారాకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రో' అని గిల్‌ను హార్దిక్‌ పాండ్యా కవ్వించాడు. సారా వయసు 22 కాగా.. శుభ్‌మన్‌ వయసు 20. శుభ్‌మన్‌ గిల్‌ 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు (372) చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అతడికి గతేడాది టీమిండియాలో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికై ఒక మ్యాచ్‌ ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా ఆడే అవకాశం దక్కలేదు.

టీమిండియా తరఫున వన్డే, టెస్టులకు ప్రాతనిధ్యం వహించిన గిల్​.. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 8 టెస్టులాడిన ఇతడు 414 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ముఖ్యంగా గబ్బా టెస్టులో అతను ఆడిన వీరోచిత ఇన్నింగ్స్​తో భారత్ తరఫున టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్​గా మారిపోయాడు.

Story first published: Wednesday, November 3, 2021, 15:53 [IST]
Other articles published on Nov 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+