Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఏం గుండెరా అది.. తొలి బంతికే బాహుబలి సిక్సర్! (వీడియో)

టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే దుమ్మురేపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో శివతాండవం చేశాడు. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌తో స్టేడియం బయటకు పంపించాడు.

అతని ధాటికి బంతి 101 మీటర్ల దూరంలో పడింది. ఈ సిక్స్‌కు న్యూజిలాండ్ బౌలర్ కమ్ కెప్టెన్ అయిన మిచెల్ సాంట్నెర్ నోరెళ్ల బెట్టాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ తరలించిన దూబేపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'ఏం గుండెరా అది.. తొలి బంతికే బాహుబలి సిక్సరా!'అని కొనియాడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

మిచెల్ సాంట్నర్ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు. అతని ధాటికి బంతి 101 మీటర్ల దూరంలో పడింది. రింకూ సింగ్ వెనుదిరిగినా.. హర్షిత్ రాణాతో కలిసి శివమ్ దూబే విధ్వంసం సృష్టించాడు.

Fans Applaud Shivam Dube After 101-Meter Six Off Mitchell Santner in IND vs NZ 4th T20I

ఒకే ఓవర్‌లో 29 పరుగులు..

ఇష్ సోదీ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా 2, 4, 6,4, 6, 6 బాది 29 పరుగులు పిండుకున్నాడు. సోదీ వేసిన షార్ట్ బాల్‌ను డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదిన దూబే.. లూప్ అప్ డెలివరీని స్లాగ్ స్వీప్‌తో లాంగాన్ దిశగా సిక్సర్ తరలించాడు. లెంగ్త్ మార్చుకొని బంతి వేసినా.. డీప్ మిడ్ వికెట్ దిశగా మరో సిక్సర్ కొట్టాడు. జాకోబ్ డఫ్ఫీ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన శివమ్ దూబే.. మరుసటి బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. రివ్యూ తీసుకోని బచాయించాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్ బాది 15 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ చేసేలా కనిపించిన శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 65) దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో హర్షిత్ రాణా కొట్టిన షాట్‌‌కు బంతి ‌బౌలర్ చేతికి తాకి నాన్‌స్ట్రైకర్ వికెట్లను తాకింది. అప్పటికే శివమ్ దూబే క్రీజును ధాటడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అతను కాసేపు ఉండి ఉంటే మ్యాచ్ భారత్ వశమయ్యేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, January 28, 2026, 22:27 [IST]
Other articles published on Jan 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+