ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసిన రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌పై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీని హిమాన్షు సాంగ్వాన్ స్టన్నింగ్ ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లీని ఔట్ చేసిన ఆనందంలో హిమాన్షు సాంగ్వాన్ కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సెలెబ్రేషన్సే కోహ్లీ ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు.
దాంతో సోషల్ మీడియా వేదికగా అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు విరాట్ కోహ్లీ వికెట్ తీసినందుకు అభిమానిస్తూనే సంబరాలు ఎక్కువయ్యాయని చురకలంటిస్తున్నారు. 'ఈ ఎక్స్‌ట్రాలే వద్దురా చిన్నోడా'అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే కోహ్లీని ఔట్ చేసాడనే బాధతో అతనిపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అతని ఫ్యామిలీని బండ బూతులు తిడుతున్నారు.

అందుబాటులో ఉన్న స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ రూల్ పెట్టడంతో విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ.. దేశవాళీ క్రికెట్ ఆడుతుండటంతో స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. అంతర్జాతీయ మ్యాచ్ తరహాలోనే భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి రోజు కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టగా.. కోహ్లీ నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. 15 బంతులు ఆడిన కోహ్లీ ఓ ఫోర్ సాయంతో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు.
హిమాన్షు సంగ్వాన్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి.. ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి ఆఫ్ సైడ్ వికెట్‌ను లేపేసింది. ఈ డెలివరీకి కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. మరోవైపు హిమాన్షు మాత్రం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేశాననే ఆనందంలో అతను ఎగిరి గంతేసాడు.
అయితే ఈ సెలెబ్రేషన్స్‌ను కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ స్టార్ బ్యాటర్ పట్ల గౌరవం లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మను ఔట్ చేసిన జమ్మూ కశ్మీర్ బౌలర్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే హిమాన్షు సాంగ్వాన్ అసలు సోషల్ మీడియా ఖాతా ఏంటో తెలియక.. ఇతరులను ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందే హిమాన్షు సాంగ్వాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను హైడ్ చేసుకున్నాడు. కోహ్లీ వికెట్ తీస్తానని ముందే ఊహించి అతను ఈ పని చేసినట్లు తెలుస్తోంది.