టీమిండియా మాజీ పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్‌కు ఓ లేడీ ఫ్యాన్ ఊహించని షాకిచ్చింది. 20 ఏళ్ల క్రితం మైదానంలోని డగౌట్ నుంచి 'జహీర్.. ఐలవ్ యూ'అని ముద్దుల వర్షం కురిపించిన ఆ లేడీ ఫ్యాన్.. తాజాగా జహీర్ ఐలవ్ యూ అనే ప్లకార్డ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి స్వాగతం పలికింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 20 ఏళ్లు అయినా జహీర్‌పై ప్రేమ చెక్కుచెదరలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే..?
20 ఏళ్ల క్రితం 2005లో పాకిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న జహీర్ ఖాన్‌కు ఓ లేడీ ఫ్యాన్ ప్రపోజ్ చేసింది. ఐలవ్ యూ జహీర్ అనే ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ ముద్దుల వర్షం కురిపించింది. ఆమె ప్రేమకు ఫిదా అయిన జహీర్ ఖాన్ కూడా చేతులు ఊపుతూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. పక్కనే ఉన్న యువరాజ్ సింగ్ జహీర్ ఖాన్‌ను ఆటపట్టించగా.. సదరు లేడీ ఫ్యాన్ సిగ్గుతో మురిసిపోయింది.
ఈ ఘటన కారణంగా దాదాపు ఓ నిమిషం పాటు మ్యాచ్ కూడా ఆగిపోగా.. క్రీజులో ఉన్న సెహ్వాగ్ బిగ్ స్క్రీన్‌పై దీన్ని చూస్తూ నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ ఐకానిక్ మూమెంట్‌గా మారిపోయింది.

20 ఏళ్ల తర్వాత ఆ మహిళతోనే..
అయితే ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జట్టుతో కలిసేందుకు వచ్చిన జహీర్ ఖాన్‌కు ఆ జట్టు సోషల్ మీడియా టీమ్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. 20 ఏళ్ల క్రితం తనను ప్రపోజ్ చేసిన అభిమానితో స్వాగతం పలికించింది. 'జహీర్ ఐలవ్ యూ'అనే ప్లకార్డ్ ప్రదర్శించింది. ఇది చూసి జహీర్ ఖాన్ స్టన్ అయ్యాడు.
ఆమె వైపు ప్రేమగా చూడగా.. సదరు లెడీ ఫ్యాన్ కూడా చాలా సిగ్గుపడుతూ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్.. 'మా జాక్‌పై ప్రేమ ఎప్పుడూ ఉంటుంది'అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గౌతమ్ గంభీర్ అనంతరం జహీర్ ఖాన్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Throwback to this iconic moment! A fan girl boldly held up an 'I love you' placard for Zaheer Khan during an intense India vs Pakistan Test match. The camera caught it all—her shy flying kiss, Zaheer’s charming reply with a flying kiss back, and Yuvraj Singh’s hilarious teasing!… pic.twitter.com/bHl0VJEOAE
— Stuff You’ll Love (@stuff_you_love) March 14, 2025