Pakistan vs Australia టెస్ట్‌లో కోహ్లీ ఫ్యాన్స్ సందడి! సెంచరీ విషయంలో స్పెషల్ రిక్వెస్ట్!

రావల్పిండి: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ ఆటకు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. శతృదేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ జరిగే ప్రతీ మ్యాచ్‌లో కోహ్లీ అభిమానులు అతని ప్లకార్డులు పట్టుకొని సందడి చేస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో కూడా ఈ సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి పాక్ అభిమానులు విరాట్ కోహ్లీని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
కోహ్లీ పాక్ గడ్డపై కొట్టాలి..
గత రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ.. దాన్ని పాకిస్థాన్ గడ్డపై సాధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పాక్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘విరాట్.. నీ 71వ సెంచరీ పాకిస్థాన్ గడ్డపై చేయాలని కోరుకుంటున్నాం'అనే పోస్టర్లతో పాక్ ఫ్యాన్స్ సందడి చేశారు. మరో అభిమాని భారత్-పాక్ మధ్య జరిగే ప్రపంచకప్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నానని, అది అత్యంత బిగ్గెస్ట్ మ్యాచ్ అనే ప్లకార్డ్ ప్రదర్శించాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ, షాహిన్ అఫ్రిది హోరాహోరీ కోసం వెయిటింగ్ అంటూ పేర్కొన్నాడు.
14 ఏళ్లుగా పాక్‌కు వెళ్లింది లేదు..
ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008లో పాక్‌లోపర్యటించింది. ఆ తర్వాతి నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్‌తో మ్యాచ్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసక్తికనబరుస్తున్నా.. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో బీసీసీఐ ముందడుగు వేయలేకపోతుంది. దాంతో వన్డే, టీ20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ వంటి మెగా టోర్నీల్లో భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పాక్ గడ్డపై ఆడింది లేదు.

రెండున్నరేళ్లుగా సెంచరీ లేదు..
2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్ట్‌లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. మళ్లీ ఆ మార్క్‌ను అందుకోలేకపోయాడు. గత రెండున్నరేళ్లుగా శతకం కోసం నీరిక్షిస్తున్నాడు. ఆడపాడదడపా హాఫ్ సెంచరీలు బాదుతున్నా వాటిని సెంచరీలుగా మలుచుకోలేకపోయాడు. ఇక సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టెస్ట్‌తో 100 మ్యాచ్‌లు మైలు రాయి అందుకున్న విరాట్.. ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత్ సూపర్ బ్యాటింగ్‌తో విరాట్‌కు ఒకే ఇన్నింగ్స్ ఆడే అవకాశం రాగా.. 45 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ధీటుగా ఆస్ట్రేలియా..
ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా.. ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (159 బంతుల్లో 15 ఫోర్లు 97) 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, మరో ఓపెనర్ వార్నర్ (114 బంతుల్లో 12 ఫోర్లతో 68) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ లబూషేన్ (117 బంతుల్లో 9 ఫోర్లతో 69 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (55 బంతుల్లో 3 ఫోర్లతో 24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం కాసేపు అంతరాయం కలిగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications