For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదాలే మా కొంప ముంచాయి: ఫాఫ్ డుప్లెసిస్

 Faf Du Plessis says we were 5-10 runs short of a total after GT beat RCB

ముంబై: బ్యాటింగ్‌లో 5-10 పరుగులు తక్కువగా చేయడం, మైదాన పరిస్థితులకు తగ్గట్లు ఆడకపోవడంతోనే ఓటమిపాలయ్యామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తాము భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారని తెలిపాడు.

విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశమని, రజత్ పటీదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. మైదానంలో ఓవైపు బౌండరీ చిన్నగా ఉంటే మరోవైపు పెద్దగా ఉందని, దీనికి తగ్గట్లు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేస్తే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

మరో 10 పరుగులు చేసుంటే..

మరో 10 పరుగులు చేసుంటే..

'175-180 పరుగుల లక్ష్యం కోసం మేం ప్రయత్నించాం. సరైన ఆరంభం లభించినా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసారు. మేం 5 నుంచి 10 పరుగులు తక్కువ చేశాం. ఆ పరుగులు వచ్చుంటే ఫలితం మరోలా ఉండేది. బంతితో కూడా మేం మంచి ఆరంభాన్ని అందుకున్నాం. కానీ గుజరాత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతూ తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. లక్ష్యచేధనలో ప్రశాంతంగా ఆడుతూ తమ పని తాము చేసుకుపోతున్నారు.

లాంగ్ బౌండరీ వైపు ఆడేలా..

లాంగ్ బౌండరీ వైపు ఆడేలా..

రజత్ పటీదార్ అద్భుతంగా ఆడాడు. అతనితో పాటు జట్టుకు ఇది గొప్ప ఇన్నింగ్స్. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాల తర్వాత అతను ఈ విధంగా ఆడటం మెచ్చుకోదగ్గ విషయం. అయితే గుజరాత్ టైటాన్స్‌లో మంచి ఫినిషర్లు ఉన్నారు. దానికి తోడు మేం చిన్న బౌండరీ వైపు అనవసరంగా 2-3 బౌండరీలు ఇచ్చాం. క్వాలిటీ ఆటగాళ్లు క్రీజులో ఉన్నప్పుడు ఒత్తిడి ఉండటం సహజమే. కానీ పోరాడే లక్ష్యం ఉండటంతో పాటు ఓ బౌండరీ పెద్దగా ఉన్నప్పుడు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేస్తే ఫలితం ఉండేది. షార్ట్ సైడ్ కాకుండా బిగ్ బౌండరీ వైపు ఆడేలా బంతులు వేసుంటే కలిసొచ్చేది.

టాప్-4లో ఒక్కరైనా..

టాప్-4లో ఒక్కరైనా..

కానీ మేం మాత్రం షార్ట్ సైడ్ కొట్టేలా బంతులు వేసి బ్యాటర్లకు సహకరించాం. వీలైనంత త్వరగా ఈ నష్టాన్ని పూడ్చాలి. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. క్రికెట్ అనేదే ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఆట. అతను హాఫ్ సెంచరీ సాధించడం కోహ్లీతో పాటు జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ జోరును ఇలానే కొనసాగించాలి. ఇక టాప్-4 బ్యాట్స్‌మన్‌లో ఒక్కరైన 70, 80 పరుగులు చేస్తేనే విజయం దక్కుతుంది. 30, 40 పరుగులు విజయాన్నందించలేవు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

 తెవాటియా, మిల్లర్ మెరుపులు..

తెవాటియా, మిల్లర్ మెరుపులు..

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58), రజత్ పటిదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు తీయగా.. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధరకు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మరో రాహుల్ తెవాటియా(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మెరుపులు మెరిపించగా.. డేవిడ్ మిల్లర్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు తీసారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Story first published: Saturday, April 30, 2022, 21:03 [IST]
Other articles published on Apr 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+