Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క ఓవర్ మా కొంప ముంచింది: ఫాఫ్ డుప్లెసిస్

Faf du Plessis says no excuses

ముంబై: పేలవ బ్యాటింగ్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. శనివారం ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయం అనంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమ ఓటమికి కారణమైందన్నాడు.

ముఖ్యంగా మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడం జట్టును కోలుకోలేని దెబ్బతీసిందన్నాడు. రెండు వైపులు స్వింగ్ చేస్తూ జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. ఈ ఘోర పరాజయం నుంచి తేరుకొని తదుపరి మ్యాచ్‌లకు తమ టీమ్ సిద్దం కావాల్సి ఉందన్నాడు. ఆరంభంలో తొందరపడకుండా మంచి ఆరంభాలను అందించడంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

ఓటమికి సాకులు లేవు..

ఓటమికి సాకులు లేవు..

'మొదటి నాలుగు ఓవర్లలో మేం చాలా వికెట్లు కోల్పోయాం. అలా వికెట్లు ఇచ్చుకోవాల్సింది కాదు. ఇది మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇన్నింగ్స్‌కు పునాది వేయడంపై మేం ఫోకస్ పెట్టాలి. ఈ ప్రయత్నంలో పవర్ ప్లేలో కొన్ని పరుగులు త్యాగం చేసినా ఏం కాదు. బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో ఓపికగా ఆడటం ముఖ్యం. స్వింగ్, సీమింగ్ అయితే దశను దాటితే తేలికగా బ్యాటింగ్ చేయవచ్చు. ఈ పిచ్ బాగుంది. మా ఓటమికి ఎలాంటి సాకులు లేవు.

బాధపడాల్సిన పనిలేదు..

బాధపడాల్సిన పనిలేదు..

జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ఫస్ట్ ఓవర్‌లోనే బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. కీలక వికెట్లు తీసాడు. ఈ ఓటమి పట్ల ఏమోషనల్ కావద్దు. ఇది మనకు కలిసి రాని రోజు అనుకోవాలి. కానీ ఈ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని తదుపరి మ్యాచ్‌లకు బలంగా తిరిగి రావాలి. సుదీర్ఘ టోర్నీ కాబట్టి ఈ ఆలోచనా దృక్పథంతోనే మేం ముందుకుసాగుతాం.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో డుప్లెసిస్, విరాట్ కోహ్లీ(0) వరుస బంతుల్లో ఔటవ్వగా.. చివరి బంతికి అనూజ్ రావత్(0) క్యాచ్ ఔటయ్యాడు. ఈ మూడు వికెట్లు ఆర్‌సీబీ పతనాన్ని శాసించాయి.

68 పరుగులకే ఆలౌట్..

68 పరుగులకే ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌట్‌గా వెనుదిరిగారు. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10) మూడేసి వికెట్లు తీయగా.. జగదీష్ సుచీత్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు తలో వికెట్ దక్కింది.

అదరగొట్టిన అభిషేక్

అదరగొట్టిన అభిషేక్

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి 72 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కేన్ విలియమ్సన్(16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(7 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, April 24, 2022, 7:10 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+