For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క క్యాచ్ వదిలేయడం మా కొంపముంచింది: ఫాఫ్ డుప్లెసిస్

Faf du Plessis Says 130 was a par score but dropped catches made it difficult

పుణే: రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడం తమ ఓటమికి కారణమైందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై అదనంగా 20 పరుగులిచ్చామని తెలిపాడు. రియాన్ పరాగ్ క్యాచ్ పట్టుంటే ఆ పరుగులు వచ్చేవి కావని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన డుప్లెసిస్.. బ్యాటింగ్ వైఫల్యం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. లక్ష్య చేధనలో టాప్ 4 బ్యాట్స్‌మన్‌లో ఒకరు రాణించాలని, కానీ అది జరగలేదన్నాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడని, చాలా మంది ఆటగాళ్లు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడని, త్వరలోనే అతను పుంజుకుంటాడని చెప్పాడు.

'ఇది కూడా గత మ్యాచ్(సన్‌రైజర్స్ హైదరాబాద్)లాంటి పిచ్. అనూహ్య బౌన్స్ ఉంది. మేం 20 పరుగులు అదనంగా ఇచ్చాడు. రియాన్ పరాగ్ క్యాచ్ నేలపాలు చేయడం తీవ్రని నష్టం కలిగించింది. ఈ వికెట్‌పై 140 పరుగులు చాలా ఎక్కువ. టాపార్డ్ బ్యాటింగ్‌ను మేం ఫిక్స్ చేసుకోవాలి. టాప్-4లో కనీసం ఒకరు రాణించడం గేమ్ బేసిక్. కానీ మేం అది చేయలేకపోయాం.

బ్యాటింగ్ ఆర్డర్ మార్చే ప్రయత్నం చేసి ఫలితం ఇస్తుందో లేదో చూడాలి. గత మ్యాచ్ తర్వాత మేం మాట్లాడుకుంది ఇదే. సానుకూలంగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు ఓపెనర్‌గా ఆడించాం. ఇక దిగ్గజ ఆటగాళ్లు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కోహ్లీ సైతం అదే దశలో ఉన్నాడు. అతను ఫామ్ అందుకునేవరకు అండగా ఉంటాం. అతను ఓ గొప్ప ఆటగాడు. త్వరలోనే ఈ గడ్డు పరిస్థితులను అధిగమిస్తాడు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్(27) పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఆర్‌సీబీ 19.3 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. ఫాఫ్ డుప్లెసిస్(23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, ప్రసిధ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Story first published: Tuesday, April 26, 2022, 23:55 [IST]
Other articles published on Apr 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+