For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే మహిపాల్ లోమ్రోర్‌ను తీసుకున్నాం: ఫాఫ్ డుప్లెసిస్

 Faf du Plessis Reveals Why is Mahipal Lomror Playing Today’s Match Against GT

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రెండ్ సెట్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని, డే గేమ్ కావడంతో పాటు మైదానంలోని వేడి కూడా ఓ కారణమని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ముందు ఫీల్డింగ్ చేస్తే వేడి కారణంగా ఆటగాళ్లు అలిసిపోయే అవకాశం ఉందన్నాడు. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రానా తమది చెత్త టీమ్ కాదని, జట్టులో క్వాలిటీ ఆటగాళ్లున్నారనే విషయం గుర్తించాలన్నాడు.

ఆటగాళ్ల అనుభవం జట్టు కలిసొస్తుందని, ప్రశాంతంగా తమ ప్రణాళికలను అమలు చేయడమే తమ పని అని చెప్పాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగా ఒక మార్పు చేశామని, మహిపాల్ లోమ్రోర్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. గుజరాత్ జట్టులోని బ్యాటర్ల ఆధారంగానే లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన లోమ్రోర్‌ను ఎంచుకున్నామన్నాడు.

ఈ మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌ల మైలు రాయి అందుకున్నాడు. ఈ ఘనతను అందుకోవడంపై అతను సంతోషం వ్యక్తం చేశాడు. 2015లో మొదలుపెట్టి తాను .. ఈ రోజు కెప్టెన్‌గా ఓ జట్టును నడిపించే స్థాయికి ఎదగడం గొప్పగా ఉందన్నాడు. ఈ ఘనతను అందుకున్నందుకు గర్వంగా కూడా ఉందని తెలిపాడు.

అయితే తాము కూడా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని, ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుందన్నాడు. ఆటగాళ్లంతా ఎక్కువగా ఆలోచించకుండా తమ సత్తాను ప్రదర్శిస్తే సరిపోతుందని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. గాయం కారణంగా యశ్ దయాల్ దూరం కాగా.. ప్రదీప్ సంగ్వాన్ వచ్చాడని, అభినవ్ మనోహర్ స్థానంలో సాయిసుదర్శన్‌ను తీసుకున్నామని చెప్పాడు.

ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఇక వరుస రెండు ఓటములతో డీలా పడ్డ ఆర్‌సీబీ.. గుజరాత్‌పై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్, మహమ్మద్ షమీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వానిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Story first published: Saturday, April 30, 2022, 15:39 [IST]
Other articles published on Apr 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+