Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RCB: అందుకే ఆ ముగ్గురిపై వేటు వేసాం: ఫాఫ్ డుప్లెసిస్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే చేజింగ్‌కు మొగ్గు చూపానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'గత రెండు మూడు రోజులుగా ఇక్కడ రాత్రి వేళలో విపరీతమైన డ్యూ వస్తుంది. ఓడినా గెలిచినా.. జట్టు మూడ్ ఒకేలా ఉంది. మేం ప్రతీ మ్యాచ్‌ను ఫ్రెష్‌గానే ప్రారంభిస్తాం. గత మ్యాచ్ ఫలితాలను ఏమాత్రం పట్టించుకోం. కొత్త బంతితో ఆరంభంలోనే ఆర్‌సీబీపై ఒత్తిడి పెట్టాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతోనే విజయం సాధించాం.

Faf du Plessis Reveals The Reason Why 3 Changes in RCB Playing vs MI In IPL 2024

జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా భారీ స్కోర్ చేసిన రికార్డు మాకు దక్కిందని తెలిసింది. ఆ విజయం మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బౌలింగ్‌లోనూ మా ప్లేయర్లు ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఇది చేజింగ్‌కు అనుకూలంగా ఉండే మైదానం. జట్టులో ఒక మార్పు చేశాం. పియూష్ చావ్లా స్తానంలో శ్రేయాస్ గోపాల్ జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

తమ జట్టులో కొన్ని మార్పులు చేశామని ఆర్‌సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. జట్టులోని కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నామని చెప్పాడు. గుడ్ క్రికెట్ ఆడనప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

కానీ మేం గత మ్యాచ్‌ల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. టీ20 క్రికెట్‌లో ఎప్పుడైనా పుంజుకోవచ్చు. గత మ్యాచ్‌లో ముంబై అదే చేసింది. మేం కూడా అలాంటి ఫలితంపైనే ఫోకస్ పెట్టాం. జట్టులో మూడు మార్పులు చేశాం. విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైశాఖ్ జట్టులోకి వచ్చారు'అని చెప్పాడు.

కామెరూన్ గ్రీన్‌, అనూజ్ రావత్, యశ్ ధుల్‌‌పై వేటు వేసిన ఆర్‌సీబీ విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, విజయ్ కుమార్ వైశాఖ్‌లకు అవకాశం కల్పించింది.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్రోర్, రీస్ టోప్లీ, విజయ్‌కుమార్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్.

Story first published: Thursday, April 11, 2024, 19:31 [IST]
Other articles published on Apr 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+