సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మ్యాచ్ టాస్ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జట్టులోని ఓ ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పిన ఫాఫ్ డుప్లెసిస్.. సదరు ప్లేయర్ తన చెల్లితో పడుకున్నాడని, వారికి మ్యాచ్‌కు ఒక రోజు ముందే పెళ్లయ్యిందని చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
అయితే ఈ ఘటన 7 ఏళ్ల క్రితం చోటు చేసుకోగా.. ఆ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. ఈ సంఘటన 2019లో సౌతాఫ్రికాలో జరిగిన 'ఎంజాన్సీ సూపర్ లీగ్' (MSL T20) చోటు చేసుకుంది. ఈ టోర్నీలో పార్ల్ రాక్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెస్సిస్.. టాస్ సమయంలో తన జట్టులోని మార్పుల గురించి వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తుది జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా? అని హోస్ట్ ప్రశ్నించగా.. ఒక మార్పు జరిగిందని, హార్డస్ విల్జోన్ ఆడటం లేదని చెప్పాడు. అతను తన చెల్లితో బెడ్‌పై రెస్ట్ తీసుకుంటున్నాడని, వారికి నిన్ననే పెళ్లి అయ్యిందని చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ వీడియోను తాజాగా ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో పేరిట ఉన్న ఓ ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో వైరల్‌గా మారింది. ఫాఫ్ డుప్లెసిస్ చాలా ఓపెన్‌గా మాట్లాడాడని, అదే ఓ భారత ఆటగాడు ఇలా మాట్లాడి ఉంటే అతని కెరీర్ క్లోజ్ అయ్యేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ అయిన హార్డస్ విల్జోన్.. ఫాఫ్ డుప్లెసిస్ సొంత సోదరి అయిన రెమీ రీనో (Rhemi Ryno) ను వివాహం చేసుకున్నాడు. సౌతాఫ్రికా రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్ అయిన హార్డస్ విల్జోన్.. ఆ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన తొలి టెస్ట్ తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను ఔట్ చేసి రికార్డ్ సృష్టించాడు.
సౌతాఫ్రికా క్రికెట్‌లో రిజర్వేషన్లు, ఇతర కారణాల వల్ల ఇతను 'కోల్‌పాక్' ఒప్పందం ద్వారా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్ళిపోయాడు. దాంతో అతని అంతర్జాతీయ కెరీర్ త్వరగానే ముగిసింది. ఐపీఎల్‌లో ఇతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టు తరపున ఆడాడు. ఫాఫ్ డుప్లెసిస్ నోరు జారడం వల్ల హార్డస్ విల్జోన్ క్రికెట్ కన్నా ఆ "బెడ్ రూమ్" కామెడీ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులర్ అయ్యాడు.