'డుప్లెసిస్ ఇంకా రిటైర్ కాలేదు, జట్టు ప్రణాళికలో ఇంకా ఉన్నాడు'

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు లభించనప్పటికీ డుప్లెసిస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం జట్టు ప్రణాళికలో ఇంకా ఉన్నాడని యాక్టింగ్ సెలక్షన్ కన్వీనర్ లిండా జోండి తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో డుప్లెసిస్‌కు చోటు దక్కలేదు.
అతడి స్థానంలో క్వింటన్ డీకాక్ సారథ్యం వహించనున్నాడు. వన్డే సిరీస్ కోసం బావుమా, ఎంగిడిలు మళ్ళీ జట్టులో చోటు దక్కించుకోగా వీరితోపాటు ఐదుగురు కొత్త వారికి బోర్డు చోటు కల్పించింది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ కథ ముగిసిందంటూ దక్షిణాఫ్రికా మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి.

డుప్లెసిస్ రిటైర్మెంట్ వార్తలపై
ఈ వార్తలపై యాక్టింగ్ సెలక్షన్ కన్వీనర్ లిండా జోండి మాట్లాడుతూ "డుప్లెసిస్ ఇంకా రిటైర్ కాలేదు. అతను ఇప్పటికీ మా ప్రణాళికల్లో ఉన్నాడు. అయితే, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనం ఇతర ఎంపికలను పరిశీలించాల్సి ఉంటుంది" అని స్పోర్ట్24కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.

టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని డుప్లెసిస్, కగిసో రబాడలను మినహాయించడం పనిభారం నిర్వహణలో భాగమని జోండి చెప్పుకొచ్చాడు. "రబాడను కూడా ఎంపిక చేయలేదు. ఇది పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఇది ఒక ముఖ్యమైన సంవత్సరం. ఇతర కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం కూడా ముఖ్యమే" అని జోండి అన్నాడు.

అన్రిచ్ ప్రపంచకప్‌లో మా కీలక బౌలర్
"గాయపడటానికి ముందే అన్రిచ్ ప్రపంచకప్‌లో మా కీలక బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అతడు చాలా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి అతడి పనిభారాన్ని తప్పక సమీక్షిస్తాం. అయితే, ప్రస్తుతానికి అతను నాతో ఏమీ చెప్పలేదు" అని సెలక్షన్ కన్వీనర్ లిండా జోండి వెల్లడించాడు.
ఝార్ఖండ్‌లో ధోనీ ప్రత్యేక పూజలు.. రీఎంట్రీ కోసమేనా?!!

తొలి వన్డే ఫిబ్రవరి 4న
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరుగుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలుచుకొని 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు జనవరి 24 నుండి జోహెన్స్ బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ పూర్తయ్యాక ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరిస్ జరగనుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 4న ఆరంభం కానుంది.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్‌కు దక్షిణాప్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (కెప్టెన్, కీపర్), బావుమా, వాన్ డెర్ దుస్సేన్, డేవిడ్ మిల్లర్, జానెమన్ మలన్, జాన్ జాన్ స్మట్స్, ఫెహ్లుక్వయో, లుతో సిఫామ్లా, షంసి, ఫార్ట్యూన్, సీసండా మగలా, కైల్ వెర్రేయన్, రిజా హెన్డ్రిక్స్, బ్యురేన్ హెన్డ్రిక్స్, లుంగి ఎంగిడి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications