బాలీవుడ్ హీరోయిన నటాషా స్టాంకో విచ్‌తో విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. పరస్పర అంగీకరంతో తాము ఇద్దరం విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా-సాంకో విచ్‌లు ప్రకటించారు. ఇద్దరం విడిపోయినా.. తమ కుమారుడు అగస్త్యకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
నవీ ముంబైలోని మైదానంలో రోహిత్ శర్మతో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యాకు సంబంధించి అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ నటి అనన్య పాండేతో హార్దిక్ పాండ్యా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ పుకార్లేనని తర్వాత స్పష్టమైంది. మరో బ్రెజిల్ సింగర్‌తో హార్దిక్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఒంటరిగా ఉంటున్న హార్దిక్ పాండ్యా గురించి రోజుకో పుకారు సోషల్ మీడియాలో హల్‌ఛల్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. బీచ్‌లో ఈ ఇద్దరు చిల్ అవుతూ రొమాన్స్ చేస్తున్న బికినీ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి.
అయితే ఈ ఫొటోలు ఏఐ మాయేనని స్పష్టమైంది. కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో ఈ ఫోటోలను రూపొందించారనే విషయం ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ మాల్దీవుల్లో కలిసి తిరుగుతున్నారని ఏఐ ఫొటోల సాయంతో కొందరు ఆకతాయిలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు స్పష్టమైంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు. ఇప్పటి వరకు సినీ రంగానికే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు.. క్రీడా రంగానికి కూడా అంటుకుంది.
ప్రముఖ హీరోయిన్లు, హీరోల ఫొటోలతో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసిన ఆకతాయిలు.. ఇప్పుడు క్రీడాకారులపై డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు రూపొందిస్తూ శునకానందం పొందుతున్నారు. ఇటీవలే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకున్నారని, వెకేషన్‌కు వెళ్లారంటూ కొన్ని ఫొటోలను ఏఐ సాయంతో క్రియేట్ చేసి వైరల్ చేశారు.
షమీ-సానియా మీర్జా బీచ్‌లో దిగినట్లు ఫొటోలు రూపొందించారు. చాలా మంది ఇది నిజమేనని పొరబడ్డారు. చివరకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవన్నీ ఏఐ ఫొటోలని, ఇందులో వాస్తవం లేదని కథనాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్-జై షా, ఇషాన్ కిషణ్- కావ్యమారన్‌కు సంబంధించిన డీప్ ఫేక్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.