Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛీ..ఛీ ఎంతకు తెగించార్రా! కావ్య పాపతో కమిన్స్ అభ్యంతరకర వీడియో!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును భంగం కలిగిస్తున్నారు.

ఇప్పటి వరకు సినీ, రాజకీయ రంగానికే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు.. క్రీడా రంగానికి కూడా అంటుకుంది. ప్రముఖ హీరోయిన్లు, హీరోల ఫొటోలతో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసిన ఆకతాయిలు.. ఇప్పుడు క్రీడాకారులపై డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు రూపొందిస్తూ శునకానందం పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ నడుస్తుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై రోజుకో తప్పుడు వీడియోను సృష్టిస్తూ వైరల్ చేస్తున్నారు.

Fact Check Video Of SRH Owner Kavya Maran With Pat Cummins Are AI-generated

ఇప్పటికే ఐసీసీ ఛైర్మెన్ జై షాతో కావ్య మారన్ స్విమ్మింగ్ ఫూల్‌లో రొమాన్స్ చేస్తున్నట్లు ఓ వీడియోను ఏఐ టూల్‌తో రూపొందించి వైరల్ చేశారు. తీరా అది ఫేక్ అని తేలింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కావ్య మారన్‌కు రంకు కట్టి మరో అసభ్యకరమైన వీడియోను రూపొందించారు. ఇది ఫేక్ వీడియో అని తెలియక కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

నిజమని పొరబడి.. కావ్య మారన్, ప్యాట్ కమిన్స్ ప్రేమలో ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో ఫేక్. ఏఐ టెక్నాలజీతో కొందరు ఆకతాయిలు రూపొందించిన వీడియో మాత్రమే. ఇలాంటి వీడియోలను షేర్ చేసి సెలెబ్రిటీల పరువుకు భంగం కలిగించి ఇబ్బందుల పాలవ్వద్దు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికల పడింది. ఘన విజయంతో ఈ సీజన్‌‌ను ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. తదుపరి మ్యాచ్‌ను శనివారం ఉప్పల్ వేదికగానే పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై కావ్య మారన్ తీవ్ర నిరాశలో ఉంది.

Story first published: Tuesday, April 8, 2025, 16:53 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+