Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: తెలంగాణ ఎస్పీగా మహమ్మద్ సిరాజ్..?

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ పోలీస్ శాఖ ప్రమోషన్ ఇవ్వనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో ఈ హైదరాబాదీ పేసర్‌‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సిరాజ్‌ను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. విరాట్ కోహ్లీ సైతం సిరాజ్‌ను ప్రత్యేకంగా కొనియాడుతూ ట్వీట్ చేశాడు.

తెలంగాణకు గర్వకారణం..

తెలంగాణ డీఎస్పీగా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్‌ను పోలీస్ శాఖ అభినందించింది. సిరాజ్ ప్రదర్శనను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.'డీఎస్సీ మహమ్మద్ సిరాజ్‌కు అభినందనలు. ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. సిరాజ్ తెలంగాణకే గర్వ కారణం. పోలీసు దుస్తుల్లో ఉన్న క్రికెట్ హీరో' అని తెలంగాణ పోలీసు శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ నెట్టింట్ వైరల్‌గా మారింది.

FACT CHECK Mohammed Siraj Not Promoted to SP Fans Social Media Demands Spark
Photo Credit: @TelanganaCOPs

సర్.. ఎస్పీని చేయండి

ఈ పోస్టు‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ సిరాజ్‌కు ఎస్పీగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. డీఎస్పీగానే చిరస్మరణీయ విజయాన్నందించాడని, ఎస్పీ అయితే మరింత మెరుగ్గా రాణిస్తాడని కామెంట్ చేస్తున్నారు. అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎస్పీగా ప్రమోషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రూల్స్ ప్రకారం సిరాజ్‌ను నేరుగా ఎస్పీని చేసే అవకాశం లేదు.

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం..

టీ20 ప్రపంచకప్ విజయానంతరం తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి అయిన డీఎస్పీ ఉద్యోగంతో పాటు హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది. సాధారణంగా డీఎస్పీ ఉద్యోగానికి డిగ్రీ అర్హత. కానీ ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చి గ్రూప్-1 స్థాయి ఉద్యోగాన్ని కేటాయించింది.

ఎస్పీగా కష్టమే..

డీఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోట్ కావాలంటే 3-5 ఏళ్ల పాటు సర్వీస్ చేయడంతో పాటు పనిలో మెరిట్ కనబర్చాలి. ఎస్పీగా ప్రమోట్ అవ్వడం కన్న ముందు అడిషనల్ ఎస్పీ కావాల్సి ఉంటుంది. కాబట్టి డీఎస్పీగా నియామకమైనప్పటికీ సిరాజ్.. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టలేదు. ప్రస్తుతం అతను భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కాబట్టి సిరాజ్‌కు ఎస్పీగా ప్రమోషన్ దక్కే అవకాశాలు లేవు.

Story first published: Tuesday, August 5, 2025, 13:41 [IST]
Other articles published on Aug 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+