Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ తెలుగు హీరోయిన్ ఆర్‌సీబీ ఓనర్ కూతురా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఓనర్ కూతురు అంటూ ఓ వీడియో ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్నఅమ్మాయి సౌత్ హీరోయిన్‌‌ను తలపించేలా ఉంది. ముద్దుగా ఉన్న ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు హీరోయినట్లు కూడా పనికి రారంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఆర్‌సీబీ క్వీన్ అంటూ బిరుదు కూడా ఇచ్చేసారు.

అంతలా కొనియాడుతూ వైరల్ చేస్తున్న ఈ అమ్మాయి గురించి ఆరా తీస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు ఈ అమ్మాయి ఆర్‌సీబీ ఓనర్ కూతురే కాదని, ఆమెకు ఆర్‌సీబీకి ఎలాంటి సంబంధం లేదనే విషయంపై స్పష్టమైంది. అంతేకాకుండా ఆమె ఓ హీరోయిన్ అని, బెంగాల్ నటి అని తెలిసింది.

Fact Check Is Bengali Actress Moksha the Daughter of the RCB Owner Here s the Truth
Photo Credit: mokksha_official

తెలుగు హీరోయిన్..

ఆ నటి ఎవరో కాదు బెంగాల్, తమిళ, మళయాళంతో పాటు తెలుగు సినిమాల్లో నటించిన మోక్ష‌గా తేలింది. ఇటీవలే వచ్చిన రామం రాఘవం చిత్రంలోనూ మోక్ష హీరోయిన్‌గా నటించింది. కొందరు ఆకతాయిలు కావాలనే ఈమె ఆర్‌సీబీ ఓనర్ కూతురు అంటూ అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయం తెలియని వారు నిజమే అనుకొని షేర్ చేస్తున్నారు.

వెస్ట్ బెంగల్‌, కోల్‌కతాలోని బరాక్‌పూర్‌కు చెందిన మోక్ష అసలు పేరు ప్రీత్ సేన్ గుప్తా. క్లాసికల్ డ్యాన్సర్ అయిన మోక్ష బెంగాలీ చిత్రం ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది. తమిళంలో యేవాల్(2022), తెలుగులో లక్కీ లక్ష్మణ్(2022), నీతోనే నేను, ఐహేట్ యు, అలనాటి రామచంద్రుడు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను, రామం రాఘవం చిత్రాల్లో నటించింది.

ఆర్‌సీబీ ఓనర్ ఎవరంటే..?

ఆర్‌సీబీ ఫ్రాంచైజీని భారత బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ప్రారంభించారు. ఆయన కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. 2012లో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది. దాంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని డయాజియో కొనుగోలు చేయడం ద్వారా.. ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది. ఆ సంస్థకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆర్‌సీబీ ఓనర్‌గా వ్యవహరిస్తోంది. టీమ్ చైర్మెన్‌గా ప్రథమేశ్ మిశ్రా జట్టు బాధ్యతలను చూసుకుంటున్నారు. ఆయన కూతురే మోక్ష అని నెటిజన్లు పొరబడుతున్నారు. కానీ ఆయన కూతురు కాదు. అంతేకాకుండా ప్రథమేశ్ మిశ్రా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉన్నాయి.

Story first published: Friday, August 15, 2025, 18:08 [IST]
Other articles published on Aug 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+