Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: బరువెక్కిన రోహిత్ శర్మ?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో రోహిత్ శర్మ భారీ పొట్టతో ఉన్నాడు. ఈ ఫొటోను పట్టుకొని కొందరు నెటిజన్లు హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్‌కు దిగారు.

బొద్దుగా ఉండే రోహిత్ శర్మ మళ్లీ బరువు పెరిగాడని, తిండిని అదుపులో ఉంచుకోకపోవడంతో అతని పొట్ట ముందుకు తన్నుకొచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు. కీలక టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకపోవడం ఏందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Fact check Has Rohit Sharma gained weight ahead of T20 World Cup 2024

అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారిన రోహిత్ శర్మ పొట్టకు సంబంధించిన ఫొటో ఫేక్ అని తేలింది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా రోహిత్ ఫొటోను మార్ఫ్ చేసి వైరల్ చేశారని, రోహిత్ ఫిట్‌‌గా ఉన్నాడని స్పష్టమైంది.

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ఫీల్డ్ సెట్‌ చేస్తున్న రోహిత్ శర్మ సైడ్ యాంగిల్ ఫొటోను తీసుకున్న ఆకతాయిలు.. పొట్ట వచ్చినట్లు మార్ఫ్ చేసి వైరల్ చేశారు. ఇక ఫిట్‌నెస్ విషయంలో రోహిత్ శర్మపై తరుచు విమర్శలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటో నిజమేనని నెటిజన్లు పొరబడ్డారు.

పాకిస్థాన్‌కు చెందిన అభిమానులు ఈ ఫొటోను వైరల్ చేశారు. భారత్‌పై ఉన్న ద్వేషంతో వారు రోహిత్ టార్గెట్ చేస్తూ నీచపనికి దిగారు. అయితే ఈ ఫొటోపై హిట్ మ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శతృదేశం రెచ్చగొట్టే పనులు చేస్తుందని, తాము సహనం కోల్పోతే ఇంత కంటే ఎక్కువ బాధపడేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఓ ఆటగాడిని బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు. జూన్ 9న తమ ఆటతోనే రోహిత్ పాకిస్థాన్ పని పడుతాడని, ఆ రోజు మాట్లాడుతామని వార్నింగ్ ఇస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Monday, June 3, 2024, 19:29 [IST]
Other articles published on Jun 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+