IPL 2026: శుభ్‌మన్ గిల్‌కు కాస్ట్‌లీ బైక్ గిఫ్ట్ ఇచ్చిన సారా టెండూల్కర్..?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగంలో ఏది నిజమో.. మరేది అబద్దమో తేల్చుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఏఐ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. పూటకో ఫేక్ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ నకిలీ ఫొటోలతో పాటు సెలెబ్రిటీలు ఇబ్బంది పడుతుంటే అభిమానులు నిజం ఏదో తెల్చుకోలేక ఆగమాగం అవుతున్నారు.
మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ ఫేక్ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా వన్డే, టెస్ట్ సారథి అయిన శుభ్‌మన్ గిల్‌కు సారా టెండూల్కర్ ఖరీదైన బైక్‌ను బహుమతిగా అందజేసినట్లు ఓ ఫేక్ ఫొటోను సృష్టించారు.

ఐపీఎల్ మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్‌కు సారా టెండూల్కర్ ఈ ఫొటో ఇచ్చినట్లుగా క్రియేట్ చేశారు. అయితే ఈ ఫొటో చూస్తేనే ఇది నకిలీదని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని గ్రహించకుండా నిజమేనని పొరబడి షేర్ చేస్తున్నారు. సారా టెండూల్కర్ పరువుకు భంగం కలిగేలా ఉన్న ఈ ఫొటోను ఉద్దేశపూర్వకంగానే సృష్టించారనే విషయం స్పష్టమవుతోంది.
గత రెండు-మూడేళ్లుగా సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఈ ఇద్దరూ ఇప్పటి వరకు అంగీకరించలేదు. కొన్ని ఇంటర్వ్యూల్లో గిల్ కొట్టిపారేసినా.. ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రేజ్‌నే అదునుగా భావించిన ఆకతాయిలు.. గిల్, సారాకు సంబంధించిన ఫేక్ ఫొటోలను ఏఐ సాయంతో క్రియేట్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆ జట్టు టాప్-2 ప్లేస్‌కు దూసుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications