SRH యువ పేసర్‌కు హగ్ ఇచ్చిన కావ్య మారన్? (వీడియో)
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓనర్ కావ్య మారన్, ఆ జట్టు యువ పేసర్ ప్రఫుల్ హింగేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రఫుల్ హింగేను కావ్య మారన్ హగ్ చేసుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన ప్రఫుల్ హింగే.. 4 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో తన రెండో మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా.. ఆఖరి ఓవర్‌లో కట్టడిగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌కు ప్రఫుల్ హింగే బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ యువ పేసర్ ప్రదర్శనకు ఫిదా అయిన కావ్య మారన్.. ఈ కుర్రాడిని హగ్ చేసుకున్నట్లు కొందరు ఆకతాయిలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఫేక్ వీడియోను సృష్టించారు.
ఈ వీడియోలో ప్రఫుల్ హింగేతో పాటు మరో యువ పేసర్ సాకిబ్ హుస్సేన్‌ను కావ్య మారన్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఉంది. అయితే ఈ వీడియోను చూస్తేనే ఇది ఏఐతో తయారు చేసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది తెలియని కొందరు అభిమానులు నిజమేనని భావించి.. వైరల్ చేస్తున్నారు. 'కుర్రాళ్ల ప్రతిభకు ఫిదా అయిన కావ్య మారన్ వారిని హగ్ చేసుకొని ప్రశంసించింది. ఆమె హగ్‌తో కుర్రాళ్లు సంతోషానికి గురయ్యారు.'అనే క్యాప్షన్స్ రాసుకొస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఎలాంటి నిజం లేదు.
కావ్య మారన్ ఎప్పుడూ మైదానంలోకి రారు. ఆటగాళ్లతో కూడా చాలా తక్కువగా మాట్లాడుతారు. ఐపీఎల్ 2024 ఫైనల్ ఓటమి అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి కావ్య మారన్ తొలిసారి వచ్చారు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. అంతే తప్పా ఎప్పుడూ ఆమె మైదానంలో అడుగుపెట్టలేదు. గ్యాలరీలోనే సందడి చేసి అక్కడి నుంచే వెళ్లిపోతారు. కావ్యమారన్‌పై డీప్ ఫీక్ వీడియోలు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. గతంలో జై షా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో సన్నిహితంగా ఉన్నట్లు ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications