టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే అభిమాన గణం ఉంది. దాంతో కోహ్లీ తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే తాజాగా కెండ్రా లస్ట్ అనే అమెరికా శృంగార తార.. సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీతో ఉన్న ఫోటోను పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అనుకోకుండా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని యూకేలో కలిసానని కెండ్రా లస్ట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్‌కు కెండ్రా లస్ట్.. 'అనుకోకుండా జరిగే సమావేశాలు ఎప్పుడూ అత్యుత్తమంగా ఉంటాయి. ఎంత గొప్ప స్ఫూర్తి, నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి'అనే క్యాప్షన్ ఇచ్చింది. #kendralust, #virat, #viratkohli, #india unitedkingdom, #PeoplesChamp, అనే యాష్ ట్యాగ్‌లను జత చేసింది.

ఈ ఫొటో క్షణాల్లో వైరల్ కాగా.. ఇది ఫేక్ అంటూ అభిమానులు తేల్చేసారు. ఏఐ జనరెటేడ్ ఫొటో అని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కుటుంబం లండన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నప్పటికీ.. గత నెలరోజులుగా భారత్‌లోనే ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు భారత్‌కు వచ్చిన కోహ్లీ.. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అలాంటిది కోహ్లీని యూకేలో కెండ్రా లస్ట్ ఎలా కలిసిందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్య కెండ్రా లస్ట్ తరుచూ ఏఐ జనరేటేడ్ ఫొటోలను పంచుకుంటుంది. ఇటీవల భారత బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ను కలిసినట్లు ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని వార్తల్లో నిలిచింది.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నాడు. ఆదివారం వడోదర వేదికగా జరిగే తొలి వన్డేతో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ సెంచరీ, హాఫ్ సెంచరీ( 131, 77)తో రాణించాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.