శ్రీలంక ఆటగాళ్లే హద్దులు దాటారు.. వైభవ్‌కు అండగా తిలక్ వర్మ, చిన్ననాటి కోచ్?
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఏతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.
సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం బయటకు వెళ్లే సమయంలో వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు ఏదో అనగా.. అతను వారిపైకి దూసుకెళ్లాడు. ఓ ఆటగాడిని తన చేతులతో నెట్టేసాడు. అంపైర్లు, శ్రీలంక వికెట్ కీపర్ జోక్యం చేసుకొని ఇద్దర్ని విడదీసారు. ఈ ఘటన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు 15 ఏళ్ల వయసులోనే సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడిన వైభవ్ సూర్యవంశీని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.

వైభవ్‌కు అండగా ఫేక్ పోస్ట్‌లు..
అయితే ఈ విమర్శల నేపథ్యంలో కొందరు ఆకతాయిలు.. వైభవ్ సూర్యవంశీకి అండగా ఫేక్ పోస్ట్‌లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ అండగా నిలిచినట్లు ఓ ఫేక్ వార్త సృష్టించారు. ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ తిలక్ వర్మ.. వైభవ్ సూర్యవంశీకి అండగా నిలిచాడనేది ఆ వార్త.
ఈ పోస్ట్ ప్రకారం.. 'మ్యాచ్ ఆసాంతం శ్రీలంక ఆటగాళ్లు మమ్మల్ని నిరంతరం దూషిస్తూనే ఉన్నారు. చివరకు అంపైర్లు కూడా కొన్ని నిర్ణయాలు వారికి అనుకూలంగా తీసుకున్నారు. మేం వాటన్నింటినీ పట్టించుకోకుండా ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టాం. కానీ, వైభవ్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీలంక ఆటగాళ్లలో ఒకరు అనవసరంగా అతన్ని దూషించాడు.
అది హద్దులు దాటడమే. దానికి వైభవ్ సూర్యవంశీ గట్టిగా బదులిచ్చాడు. అతను చేసింది సరైన పనే'అని తిలక్ వర్మ అన్నట్లుగా ఫేక్ పోస్ట్‌ను క్రియేట్ చేశారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ ఏ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడలేదు. వైభవ్ సూర్యవంశీ గొడవ గురించి కూడా మాట్లాడలేదు. కానీ ఇది నిజమేనని పొరబడి కొందరు నెటిజన్లు ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
కోచ్‌ను కూడా వదల్లేదు..
తిలక్ వర్మనే కాకుండా అతని చిన్న నాటి కోచ్ కూడా వైభవ్ సూర్యవంశీకి అండగా మాట్లాడినట్లు కూడా ఫేక్ పోస్ట్ క్రియేట్ చేశారు. 'నేను వైభవ్ సూర్యవంశీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కోచింగ్ ఇస్తున్నాను. అతని ప్రవర్తన గురించి నాకు బాగా తెలుసు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ప్రజలు అతనిపై ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. నిన్న రాత్రి నేను వైభవ్‌తో మాట్లాడాను.
మ్యాచ్ ఆసాంతం శ్రీలంక ఆటగాళ్లు తనను నిరంతరం దూషించారని, చివరికి తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారని అతను నాతో చెప్పాడు. అతను చాలా సేపటి వరకు ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ ఎవరికైనా ఒక పరిమితి ఉంటుంది.
పదే పదే రెచ్చగొట్టడం వల్లే అతను అలా స్పందించాల్సి వచ్చింది. అతనిని విమర్శించే బదులు, మనం అతనికి అండగా నిలవాలి. అలాగే ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు పూర్తి విషయాన్ని అర్థం చేసుకోవాలి.'అని వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ చెప్పినట్లు ఓ ఫేక్ పోస్ట్ క్రియేట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

