IPL 2026: ప్లే ఆఫ్స్ రేసులో పాయింట్స్, రన్‌రేట్ సమమైతే ఏం చేస్తారు..?
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. 62 లీగ్ మ్యాచ్‌లు ముగిసే సరికి డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాత్రమే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. మరో మూడు స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో ఐదు జట్లకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
అయితే ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవనున్నాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కనుంది. అయితే రన్‌రేట్ కూడా సమమైతే ఏం చేస్తారు? అనేది అభిమానులకు సందేహంగా మారింది.
పాయింట్స్, రన్‌రేట్ సమమైతే..?
ఐపీఎల్ లీగ్ రూల్స్‌లోని సెక్షన్ 16.10 ప్రకారం.. పాయింట్స్, రన్‌రేట్ సమమైతే.. లీగ్ మొత్తంలోని వేసిన సరైన బంతులకు సాధించిన వికెట్ల రేషియోను లెక్కిస్తారు. ఈ ఏ జట్టు రేషియా మెరుగ్గా ఉంటే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. ఒకవేళ ఈ వికెట్స్ రేషియో కూడా సమంగా ఉంటే.. డ్రా తీస్తారు.

ఐపీఎల్ కండిషన్స్ ఏంటంటే..?
16.10.2.2: లీగ్ సీజన్ ముగిసే సమయానికి జట్ల పాయింట్లు, విజయాల సంఖ్య సమానంగా ఉంటే.. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది.
16.10.2.3: పాయింట్స్‌తో పాటు నెట్ రన్ రేట్ కూడా సమానంగా ఉంటే.. ఆ సీజన్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌ల్లో వేసిన ప్రతి సరైన బంతికి అత్యధిక సంఖ్యలో వికెట్లు పడగొట్టిన జట్టుకు టోర్నీలో ముందడుగు వేసే అవకాశం దక్కుతుంది.
16.10.2.4: లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్స్, నెట్‌రన్‌రేట్, వికెట్స్ రేషియో కూడా సమానంగానే ఉంటే.. అప్పుడు లాటరీ ద్వారా జట్టు స్థానాన్ని నిర్ణయిస్తారు.
19 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు..
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పాయింట్లు సమానమైన సందర్భాలు చాలా వచ్చాయి కానీ, పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా వంద శాతానికి వంద శాతం సమానమైన సందర్భం ఇప్పటివరకు రాలేదు. సాధారణంగా నెట్ రన్ రేట్ తేడాతోనే విజేత ఎవరో తేలిపోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications