Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీ చేసినా శుభ్‌మన్‌ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!

Experts warns Team India for Shubman Gill’s Powerplay approach

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలకడకు మారుపేరుగా మారాడు. వరుసగా రాణిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన శుభ్‌మన్... అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర సెంచరీతో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

టెస్ట్‌ల్లో, వన్డేల్లో సత్తా చాటిన శుభ్‌మన్ గిల్.. టీ20ల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో అతని చేసిన( 126 నాటౌట్) పరుగులే అతని బెస్ట్ టీ20 ఇన్నింగ్స్. ఈ సెంచరీకి ముందు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

గిల్‌తో టీమిండియాకు ముప్పే..

గిల్‌తో టీమిండియాకు ముప్పే..

దాంతోనే టీ20 ఫార్మాట్‌కు శుభ్‌మన్ గిల్ పనికిరాడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడ్డారు. టీ20ల నుంచి అతన్ని తప్పించాలని సూచించారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం గిల్ స్కిల్‌పై నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు ఇచ్చింది.

తొలి రెండు టీ20ల్లో ఆకట్టుకోపోయినా.. మూడో టీ20లో అవకాశం కల్పించి వెన్నుతట్టింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గిల్ సెంచరీతో చెలరేగాడు. అయితే గిల్ సెంచరీ చేసినా.. టీ20 ఫార్మాట్‌లో అతనితో టీమిండియాకు ప్రమాదమేని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అతని నెమ్మదైన బ్యాటింగ్‌ టీ20 ఫార్మాట్‌కు ఏ మాత్రం పనికిరాదంటున్నారు.

డాట్ బాల్స్‌ ఎక్కువ..

డాట్ బాల్స్‌ ఎక్కువ..

గిల్ తరహా బ్యాటింగ్ మిడిలార్డర్‌లో సెట్ అవుతుందని, ఓపెనర్‌గా అలా ఆడాలంటే అన్ని మ్యాచ్‌లు కుదరవని అభిప్రాయపడుతున్నారు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలోనూ అతను నిదానంగానే తన ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడని గుర్తు చేస్తున్నారు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న అతను.. తర్వాత 19 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అతని ఇన్నింగ్స్‌లో 12 డాట్ బాల్స్ ఉండటం విశేషం. టీ20ల్లో డాట్ బాల్స్ ఆడటం క్రైమ్అని, అంతేకాకుండా పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడటం జట్టుకు నష్టం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడాడు కాబట్టి గిల్ స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలిగాడని, త్రిపాఠే గనుక ఔటై ఉంటే గిల్ కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవాడని పేర్కొంటున్నారు.

ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడే సెంచరీలు..

ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడే సెంచరీలు..

అంతేకాకుండా గిల్ ఒత్తిడిలో ఆడలేడని, ఇటీవల, గతంలో అతను చేసిన సెంచరీలన్నీ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చినవేనని వివరిస్తున్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాటింగ్ చేయడం గిల్‌కు చేతకాదని, పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుపడటం కూడా రాదంటున్నారు. సరైన ఓపెనర్ లేకనే టీమిండియా గత రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో విఫలమైందని, ముఖ్యంగా కేఎల్ రాహుల్ వైఫల్యం భారత్ పతనాన్ని శాసించిందని చెబుతున్నారు.

ఇప్పుడు అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ప్రపంచకప్‌కు రెడీ చేయడం ఏంటో తమకు అర్థం కావడం లేదంటున్నారు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఆరంభంలోనే గిల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా రెండు లైఫ్స్ అందుకున్నాడు.

 కేఎల్ రాహుల్‌లానే..

కేఎల్ రాహుల్‌లానే..

'ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని అధిగమిస్తూ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయలేడు. అతని బ్యాటింగ్ శైలి వన్డేలకు సూటైనా.. టీ20లకు మాత్రం సరిపోదు. అతని స్థానంలో పృథ్వీ షా వంటి అటాకింగ్ ప్లేయర్‌ను రెడీ చేసుకోవాలని ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు.

కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. కేఎల్ రాహుల్ సైతం తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించి.. అసలు సిసలు ప్రపంచకప్‌లో మాత్రం చేతులెత్తేసాడు. శుభ్‌మన్ గిల్‌తో టీ20 ప్రపంచకప్ 2024 ఆడితే మళ్లీ ఇదే ఫలితం రిపీట్ అవుతుంది'అని క్రికెట్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Story first published: Thursday, February 2, 2023, 16:30 [IST]
Other articles published on Feb 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+