Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నాడు.. ఫ్లాట్ వికెట్‌పైనే ఆడుతాడు: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని, అధిక బరువుతో ఉన్నాడని విమర్శించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం హిట్ మ్యాన్‌కు లేదని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ ఫ్లాట్ వికెట్‌పై మాత్రమే ఆడగలడని, బౌన్స్‌‌ను ఆడలేడని తెలిపాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ex-South African cricketer Daryll Cullinan says Rohit Sharma is a flat track bully is overweight

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మపై డారిల్ కల్లినన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'ఒకసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ‌ని గమనిస్తే ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ కండిషన్ ఏంటో అర్థమవుతోంది. రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడు.

అతను ఏ మాత్రం లాంగ్ టర్మ్ క్రికెటర్ కాదు. నాలుగు, ఐదు రోజుల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ సరైన ఫిజికల్ కండిషన్‌తో లేడు. భారత కండిషన్స్‌తో పాటు ఫ్లాట్ వికెట్స్ మాత్రమే రోహిత్ ఆడగలడు. బౌన్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేడు.'అని డారిల్ కల్లినన్ చెప్పుకొచ్చాడు.

Ex-South African cricketer Daryll Cullinan says Rohit Sharma is a flat track bully is overweight

అతని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా చెరొక మ్యాచ్ గెలిచాయి. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి గబ్బా వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ శర్మ రాణించాల్సి ఉంది. లేదంటే అతనిపై విమర్శలు ఎక్కువవ్వనున్నాయి.

Story first published: Thursday, December 12, 2024, 13:40 [IST]
Other articles published on Dec 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+