Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: అందరూ కలిసే ఉప్పల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారు!

 EX-MP Konda Vishweshwar Reddy slams HCA president Mohammad Azharuddin Over IND vs AUS Tickets Issue

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న భారత్Xఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ ఈ టికెట్ల గోల్‌మాల్‌కు తెరలేపాడన్నారు. పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే భారీగా అవకతవకలు జరిగాయని తెలిపారు. 20 నిమిషాల్లోనే 30 వేలకు పైగా టిక్కెట్లు ఎలా అమ్ముడు పోతాయని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రికెట్ టికెట్ల విషయంలో ఎంటర్ అయ్యారని చెప్పారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ..

ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ..

అందరూ కలిసి టికెట్లను బ్లాక్‌లో అమ్మేసి భారీగా సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో ప్రభుత్వంకు ఏమి సంబంధం ఉందో సమాధానం చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని.. బీసీసీఐ ఆదేశాలతోనే హెచ్‌సీఏ టికెట్లు విక్రయిస్తుందన్నారు. గురువారం జింఖానా మైదానం వద్ద తొక్కిసిలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అధికారమే లేకున్నా..

అధికారమే లేకున్నా..

వాస్తవానికి సుప్రీం కోర్టు మార్గ నిర్దేశం ప్రకారం అజారుద్దీన్, విజయానంద్‌కు చెక్ పవర్ తప్పితే హెచ్‌సీఏలో ఎలాంటి పవర్ లేదు. అజారుద్దీన్ గ్రూప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిలో వారికే పొసగడం లేదు. అజార్, విజయానంద్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించగా.. హెచ్‌సీఏలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జస్టిస్ కక్రూ నేతృత్వంలో సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇందులో సభ్యులుగా ఏసీబీ డీజీ అంజనీ కుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌లను నియమించింది. ఫైనాన్షియల్ సహా ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కమిటీ ముందు ఉంచాలని హెచ్‌సీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు అజార్, విజయానంద్ వర్గాలు కాంప్రమైజ్ అవ్వగా.. కొన్ని కారణాల వల్ల కక్రూ ఇప్పటిదాకా హెచ్‌సీఏకు రాలేదు. మిగతా సభ్యులు కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో అజార్ అండ్ కో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ముఖ్యంగా అజర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయి.

కట్టుదిట్టంగా ఏర్పాట్లు..

కట్టుదిట్టంగా ఏర్పాట్లు..

మూడో టీ20 కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబువుతోంది. మైదానం బయట మూడు రంగులతో పెయింట్స్ వేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఉన్న చెట్లకు కూడా మూడు రంగులు వేశారు. ఇక స్టేడియం దగ్గర టికెట్స్ ఇస్తారేమో అన్న ఆశతో అప్పుడుప్పుడు అభిమానులు వచ్చిపోతున్నారు. ఇప్పటికే టికెట్స్ ఇష్యూ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌సీఏ.. మ్యాచ్ నిర్వహణ లో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Story first published: Friday, September 23, 2022, 16:45 [IST]
Other articles published on Sep 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+